మాస్ హిట్ కోసం పరితపిస్తున్న బెల్లం కొండ...!

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. స్టార్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ కొడుకుగా తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు బెల్లంకొండ శ్రీనివాస్.. తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్నాడు ఈ యువ హీరో. కెరీర్ ఆరంభం నుంచి బెల్లం కొండ స్టార్ హీరోయిన్స్ తో కలిసి నటించాడు. 2014 లో వి.వి.వినాయక్ డైరెక్షన్లో వచ్చిన ‘అల్లుడు శీను’ చిత్రంతో హీరోగా పరిచయమైన శ్రీనివాస్.. మొదటి చిత్రంతోనే మాస్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తరువాత ‘జయ జానకి నాయకా’ చిత్రం కూడా పర్వాలేదు అనిపించింది. ఇక ‘రాక్షసుడు’ చిత్రం శ్రీనివాస్ ను మంచి నటుడుగా నిలబెట్టింది. అయితే ‘సీత’ ‘రాక్షసుడు’ వంటి కథా ప్రాధాన్యత కలిగిన సినిమాలను చేసి మాస్ ప్రేక్షకులకు దూరంగా ఉంటూ వచ్చాడు ఈ యంగ్ హీరో.

అయితే ప్రస్తుతం ‘అల్లుడు అదుర్స్’ అనే మాస్ మసాలా ఎంటర్టైనర్ లో నటిస్తున్నాడు. ‘కందిరీగ’ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకుడు. సోనూసూద్, ప్రకాష్ రాజ్ వంటి వారు కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘అల్లుడు అదుర్స్’ తో కచ్చితంగా ఓ మాస్ హిట్ కొట్టాలని.. 2021 సంక్రాంతికే రాబోతున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. మాస్ ఆడియెన్స్ లో ఈ కుర్ర హీరో సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకుంటాడు కాబట్టి..

ఈ యంగ్ హీరోకి సరైన సినిమా పడితే స్టార్ అయిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒక్క ‘కవచం’ ‘సీత’ చిత్రాలను పక్కనపెట్టేస్తే సాయి శ్రీనివాస్ నటించిన దాదాపు అన్ని సినిమాలు మాస్ ఆడియెన్స్ ను బాగా మెప్పించాయి. మరి ‘అల్లుడు అదుర్స్’ తో కనుక మాస్ హిట్ కొడితే.. ఈ కుర్ర హీరో తన టార్గెట్ ను రీచ్ అయినట్టే..! ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన ఆర్టికల్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: