సుమంత్ కి సమంత సపోర్ట్.. సూపర్ అన్నా !

Chaganti
ఒకప్పటి స్టార్ హీరో, లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు మనవడుగా, అక్కినేని కంపాండ్ నుంచి వచ్చిన హీరో సుమంత్ 1999లో రామ్ గోపాల్ వర్మ ప్రేమ కథ అనే సినిమాతో వెండితెరకి పరిచయం అయ్యాడు, ఇప్పటి వరకు ఈయన సుమారు పాతిక సినిమాలు చేసినా అందులో హిట్స్ మాత్రం టక్కున చెప్పలేము. ఇక ఆయన ఎట్టకేలకు మళ్ళీ రావా సినిమాతో హిట్ కొట్టడంతో అయన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడని అనుకున్నారు. అయితే ఆ అంచనాలను తలకిందులు చేస్తూ ఆ తర్వాత చేసిన సినిమాలు మళ్ళీ మాములే అయ్యాయి.

ఈయన ఇప్పుడు కపటధారి అనే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా చేస్తున్నాడు. బఫిట్ మీడియా వర్క్స్ బ్యానర్ లో తమిళ నిర్మాత ధనుంజయ్ , తమిళ్ దర్శకుడు ప్రదీప్ కృష్ణ స్వామి ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఈరోజు ఈ సినిమా టీజర్ ను విడుదల చేసింది సినిమా యూనిట్. ఈ టీజర్ చూస్తే మర్డర్ మిస్టరీగా ఈ సినిమా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా టీజర్ ని షేర్ చేసిన సమంతా, సుమంత్ అన్నా ఇంటరెస్టింగ్ అని పేర్కొంటూ ఆమె లింక్ షేర్ చేసింది.
 దానికి ఆయన చెల్లె థాంక్స్ అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమా కన్నడ రీమేక్ సినిమా, 2018 లో కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ కుమార్ నూతన దర్శకుడు హేమంత్ రావు దర్శకత్వంలో కోవల్దారి అనే సినిమా చేశారు. రిషి, అనంత్ నాగ్ లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమా, రెండు కోట్ల రూపాయల బడ్జెట్ తో చేస్తే పది కోట్లకు పైగా వసూళ్లని రాబట్టి పెద్ద హిట్ అయ్యింది. మాతృక ప్రకారం అయితే ట్రాఫిక్ ఎస్సైగా ఉంటూ, పాతికేళ్ల క్రితం జరిగిన హత్యలని ఇన్వెస్టగేషన్ చేసే పాత్ర చేస్తున్నాడు సుమంత్.ఈ సినిమాని థియేటర్ లు తెరుచుకున్నాక అందులోనే రిలీజ్ చేయడానికి చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: