ఆ నటి సూసైడ్ చేసుకోవాలని అనుకుందట.. అసలు కారణం ఇదే..!!

Satvika
మనిషి అన్నాక చాలా కష్టాలు నష్టాలు అన్నీ ఉంటాయి.అలాగని చనిపోకూడదు.. అని పెద్దలు అంటారు.అయితే సినీ ఇండస్ట్రీలోని చాలా మంది ప్రముఖులు అవకాశాలు లేక చనిపోవాలని అనుకున్నారు.. మరి కొందరు చనిపోయారు కూడా.. అలా చేయడం వల్ల చిన్న వయసులోనే ప్రాణాలను కోల్పోవడం వల్ల బంగారు భవిష్యత్ నాశనం అవుతుంది. అందుకనే సమస్యలు వచ్చినప్పుడు చావు పరిష్కారం కాదు అని అంటారు. కానీ ఓ నటి మాత్రం వచ్చిన సమస్యలను తట్టులేక చనిపోవాలని అనుకుందట ఆమె ఎవరు ఎందుకు ఆ ఆలోచన చేసింది అనేది ఇప్పుడు చూద్దాం..

తెలుగులో ఇటీవలే వచ్చిన ‘జెర్సీ’ చిత్రంలో జర్నలిస్ట్‌ రమ్య పాత్ర పోషించిన సనూష.. జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొందట. మానసిక కుంగుబాటుకు, మనస్తాపానికి గురయ్యిందట. దీంతో చాలా భయపడ్డానని, ఒకానొక సమయంలో ఆ క్లిష్ట పరిస్థితుల నుంచి ఎలా బయటపడాలో తెలియక ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వచ్చాయని తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది సనూష.  ఆ సమయం లో నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక పోయను అప్పుడు డాక్టర్ దగ్గరకు వెళ్ళాను.ఆయన చికిత్స వల్ల నన్ను నేను కంట్రోల్ చేసుకున్నాను అని వెల్లడించింది.

ఈ విషయం పై చెప్పినప్పుడు చాలా మంది ఆమె చెప్పిన  విధానం చూసి నవ్వారు అని చెప్పుకొచ్చింది.. మరి కొందరు నెటిజన్లు మాత్రం కామెంట్లు పెడుతున్నారు అని చెప్పుకొచ్చింది..మానసిక కుంగుబాటుతో ఇబ్బందిపడేవాళ్లు తన వీడియో చూసి ధైర్యంగా ఉంటారనే ఉద్దేశంతోనే అలా మాట్లాడానని ఆమె అంది. చిన్న వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలలోకి వచ్చిన ఈ అమ్మడు మలయాళ సినిమాలలో నటించి గుర్తింపు తెచ్చుకుంది.. తెలుగులో పవన్ కళ్యాణ్ నటించిన బంగారం సినిమాలో వింద్య పాత్రలో కనిపించింది.తర్వాత ‘జీనియస్‌’, ‘రేణిగుంట’ సినిమాల్లో కీలకపాత్రల్లో నటించింది. అలాగే నాని హీరోగా వచ్చిన ‘జెర్సీ’సినిమా పత్రికలో జర్నలిస్ట్ గా నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: