హౌజ్ లో రెండోసారి కెప్టెన్ గా నోయెల్.. కాని ఇంకా రిస్క్ లోనే..!

shami
బిగ్ బాస్ హౌజ్ లో రెండోసారి కెప్టెన్ గా సత్తా చాటాడు నోయెల్. హౌజ్ లో రెండోవారం కెప్టెన్ గా ఎన్నికైన నోయెల్ మళ్ళీ ఆరవ వారం కెప్టెన్ గా ఎంపికయ్యాడు. కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా అఖి, అరియానా టీం లతో అమీ తుమీ టాస్క్ లో అఖిల్ టీం విన్ అవగా అఖిల్ టీం లో ఉన్న అందరు కెప్టెన్సీ టాస్క్ లో పాల్గొన్నారు. హెడ్ బాట్ తో కలర్ బాల్స్ ను గోల్ చేయాల్సి ఉంటుంది. అందులో నోయెల్ తన పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు.
టాస్క్ గెలవడంతో ఇంటి కెప్టెన్ గా నోయెల్ మరోసారి ఎంపికయ్యాడు. హౌజ్ లో కెప్టెన్ గా అయినా కూడా అమీ తుమీ టాస్క్ లో నోయెల్ డైరెక్ట్ గా నామినేట్ అయిన కారణంగా ఇమ్యునిటీ మాత్రం ఇవ్వలేదు. కెప్టెన్ గా మాత్రమే తప్ప నామినేషన్స్ నుండి తప్పుకునే ఛాన్స్ లేదు. హౌజ్ లో కెప్టెన్ గా నోయల్ ఎలాంటి హంగామా చేస్తాడో చూడాలి.
హౌజ్ లో నోయల్ మొదటి రెండు వారాల్లో కనిపించినంత దూకుడు చూపించడం లేదు. కాలు నొప్పి చేయడం వల్ల ఆటలో వెనకపడుతున్నాడు నోయల్. టాప్ 5లో ఉండే ఛాన్స్ ఉన్నా తనకి హౌజ్ లో కంఫర్ట్ గా లేదని ఇంటికి వెళ్లాలని అనుకుంటున్నట్టు చెప్పాడు నోయల్. గంగవ్వ మాదిరిగా తనని కూడా ఇంటికి పంపిస్తే బెటర్ అని అభిజిత్ తో నోయల్ చెప్పాడు. మరి నోయల్ హౌజ్ లో కెప్టెన్ గా ఉన్నా ఈ వారం నామినేషన్స్ లో ఉండటం వల్ల ఎలిమినేట్ అయినా అవ్వొచ్చని అంటున్నారు.                                           

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: