అన్నయ్య రమేష్ తీరు పై మహేష్ ఆశక్తికర కామెంట్స్ !

Seetha Sailaja
సూపర్ స్టార్ కృష్ణ  కొడుకు అనగానే ఎవరికైనా వెంటనే మహేష్ మాత్రమే  గుర్తుకు వస్తాడు. అయితే మహేష్ పెద్దకొడుకు రమేష్ గురించి ఈనాటితరం  వారికి పెద్దగా తెలియదు. మహేష్ కంటే ముందుగానే  హీరోగా రమేష్ బాబు ఇండస్ట్రీకి పరిచియం అయ్యాడు. కానీ అతడు నటించిన సినిమాలు అన్ని ఫెయిల్ కావడంతో తన హీరో కెరియర్ కు బ్రేక్ ఇచ్చి నిర్మాతగా మహేష్ తో రెండు భారీ సిఎమాలు  నిర్మించాడు.


అయితే ఆరెండు సినిమాల ఫలితం నిరాశ పరచడంతో అతడి నిర్మాత కెరియర్ కు కూడ బ్రేక్పడింది. 1987 సంవత్సరంలో హీరోగా అరంగేట్రం చేసిన రమేష్ బాబు 1997 వరకు దశాబ్ధం పాటు ఇండస్ట్రీలో కొనసాగి ఎందరో ప్రముఖ దర్శకుల సినిమాలలో నటించాడు. హీరోగా అతడి కెరియర్ బ్రేక్ పడిన తరువాత కృష్ణ వారసత్వ లెగసీని మహేష్ బాబు  కొనసాగిస్తున్నాడు.

వాస్తవానికి మహేష్ రమేష్ లు కలసి ఎప్పుడు బయట ఫంక్షన్స్ లో  కనిపించరు. వీరిద్దరి మధ్య అన్నదమ్ముల ప్రేమాను బంధానికి సంబంధించిన వార్తలు కూడ ఎప్పుడు బయటకురావు. ఇలాంటి పరిస్థితులలో ఈమధ్య జరిగిన రమేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మహేష్ తన సోదరుడికి శుభాకాంక్షలు తెలిపి అందరికి షాక్ ఇచ్చాడు.   గతంలో మహేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు తన అన్నయ్య రమేష్ తో కలిసి నటించిన ఒక స్టిల్ షేర్ చేశాడు.


‘నా అన్నయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నా అభ్యాసంలో కొంత భాగం అతని నుండి వచ్చిందని సులభంగా చెప్పగలను క్రమశిక్షణ అంకితభావం అభిరుచి అతను నిస్వార్థంగా నాకు ఇచ్చాడు. మీకు ఆరోగ్యం చాలా ఆనందం దక్కాలని కోరుకుంటున్నాను”  అంటూ మహేష్ చేసిన కామెంట్స్ మహేష్ అభిమానుల మధ్య వైరల్ గా మారాయి.  ఈమధ్య మహేష్ తన చెల్లెలు ప్రియదర్శిని బర్త్ డే సందర్భంగా అక్కడకు వెళ్ళి సందడది చేసిన విషయం తెలిసిందే. ఇలా మహేష్ తన టాప్ హీరో కెరియర్ ను కొనసాగిస్తూనే తన కుటుంబ సభ్యులతో తనకున్న అనుభందాన్ని అవకాశం వచ్చినప్పుడల్లా తెలియచేస్తున్నాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: