తన మనసులోని బాధను బయటపెట్టిన సోనూ సూద్..!!!!
అంతేకాదు పేద రైతులకు ట్రాక్టర్లను కూడా ఉచితంగా ఇచ్చి.. మకుటం లేని మహారాజు అనిపించుకున్నాడు. సినిమాల్లో ఇతను విలనే కావచ్చు.. కానీ రియల్ లైఫ్ లో మాత్రం హీరో అనిపించుకున్నాడు. ఎంతో మంది పాలిట దేవుడు అయ్యాడు. చెప్పాలంటే ఈయన ఈ కరోనా టైం లో ఒక మినీ గవర్నమెంట్ నే నడిపాడు. అంతలా సేవలు చేసి రియల్ హీరో అయిపోయాడు.చాలా మంది రాజకీయ నాయకులకు అలాగే హీరోలకి ఆదర్శంగా నిలిచాడు సోనూ సూద్. ఇదిలా ఉండగా.. సోనూ సూద్ ఓ విషయంలో బాగా హర్ట్ అయ్యాడట. తన ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు. “ఈ కోవిడ్ సిట్యుయేషన్లో కూడా ధనవంతులు మరింత ధనవంతులు అయ్యారు.
పవర్ ఫుల్ వ్యక్తులు మరింతగా తమ పవర్ ను పెంచుకున్నారు. కానీ పేదలు మాత్రం..మరింత నిరుపేదలయ్యారు. ఇదేం బాలేదు. ఈ విషయంలో నేను బాగా హర్ట్ అయ్యాను. నాకు చాలా బాధగా ఉంది” అంటూ పేర్కొన్నాడు సోనూ సూద్.ఈ ట్వీట్ తో సమాజం గురించి అతను ఎంతగా ఆలోచిస్తాడో స్పష్టమవుతుంది అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.