ఏంటి కబ్జా 2 కూడా ఉందా...?

Suma Kallamadi
ఉపేంద్ర అనేక భాషల్లో నటించి పెద్ద స్టార్ అయ్యిపోయాడు. కన్నడ , తమిళం తో పాటు తెలుగు సినిమాల్లో కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో దేవరాజు పాత్ర చేసి ప్రేక్షకులని మెప్పించాడు. ఇప్పుడు  కబ్జా తో తెర మీదకి రాబోతున్నాడు ఉపేంద్ర.  అయితే ఏదైనా ఒక కథను ఒకే సినిమా లో ప్రేక్షకులకు చెప్పలేం అనే పరిస్థితి వస్తే..... చిత్రబృందం అప్పుడు ఆ కథను రెండు భాగాలుగా తీస్తూ ఉంటారు. ఇది మనకేం కొత్త కాదు. మనం ఇటీవల కాలం లో 'బాహుబలి, కేజీయఫ్‌ 'లు కూడా రెండు పార్ట్స్ గానే చూసాం.  ఈ చిత్రాన్ని ముందు ఒక్క సినిమాగా ప్లాన్‌ చేసారు కానీ .... లాక్‌డౌన్ ‌లో ఈ కథ పై ఇంకా వర్కవుట్‌ చేశారు. దాంతో కథ పెద్దదయింది. ఈ కారణం గానే సినిమాని రెండు భాగాలుగా తీయాలని చిత్ర యూనిట్ నిర్ణయించుకున్నారు.

ప్యాన్‌ ఇండియా చిత్రం 'కబ్జా' కూడా రెండు పార్ట్స్ గా తెర మీదకి రాబోతోంది. ఈ కబ్జా చిత్రానికి ఆర్‌. చంద్రు దర్శకత్వం వహిస్తుండగా.... ఉపేంద్ర ముఖ్య పాత్ర లో నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ  చిత్రం అంతా కూడా మాఫియా బ్యాక్ ‌డ్రాప్‌ లో ఉంటుంది.  ఉపేంద్ర మాఫియా డాన్‌లా కనిపించనున్నారు. మరి ఆ పాత్ర ఎంతలా ఆకట్టుకుంటుందో చూడాలి. ఉపేంద్ర తెర మీదకి వస్తున్నదంటే ఫాన్స్ కి పండగే.

ఇది ఇలా ఉండగా  రెండో భాగం ఐడియా ఉపేంద్ర గారి కి చాలా నచ్చింది అని దర్శకుడు చంద్రు తెలియ జేయడం జరిగింది. ఈ కబ్జా చిత్రం షూటింగ్ నవంబర్ ‌లో తిరిగి ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో చిత్రీకరణ జరుపుకోనున్నారు. మొత్తం  ఈ సినిమా సుమారు 7 భాషల్లో విడుదల అవ్వనుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: