ఆ హీరో సినీ భవిష్యత్తు అంతేనా..?

NAGARJUNA NAKKA
రాజ్‌ తరుణ్‌ కెరీర్‌ క్లైమాక్స్‌కి వచ్చేసింది. ఇంక ఈ కుర్రాడు హీరోగా ఏదో చేద్దాం అనే ఆలోచనలు మానేసి, సపోర్టింగ్‌ రోల్స్‌కి వెళ్లడం బెటర్.. ఇప్పటికే ఎవ్వరూ పట్టించుకోట్లేదు.. ఇంకెంత ట్రై చేసినా కష్టమే. రాజ్‌ తరుణ్‌ మరో ఆప్షన్‌ చూసుకోవడం బెటర్‌ అని కామెంట్ చేస్తున్నారు సినీజనాలు.

రాజ్‌ తరుణ్‌ ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా సినిమాల్లోకి వచ్చాడు. 'కుమారి 21ఎఫ్' లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ఆ తర్వాత మళ్లీ ఆ రేంజ్‌ సక్సెస్‌ రాలేదు. నాలుగేళ్ల నుంచి డిజాస్టర్ల మీద డిజాస్టర్లు పడుతున్నాయి. ఈ బ్యాక్‌ టు బ్యాక్‌ ఫ్లాపులతో జనాలు రాజ్‌ తరుణ్‌ని పట్టించుకోవడం కూడా మానేస్తున్నారని ట్రేడ్‌ టాక్.

రాజ్‌ తరుణ్‌ లేటెస్ట్ రిలీజ్ 'ఒరేయ్‌ బుజ్జిగా' సినిమాకి కూడా ఫ్లాప్‌ టాక్ వచ్చింది. థియేటర్ల బంద్‌తో ఓటీటీలో రిలీజ్ అయిన ఈ మూవీకి నెగిటివ్ టాక్ వచ్చింది. సినిమా అస్సలు బాలేదనే కామెంట్స్ వచ్చాయి. దీంతో రాజ్‌ తరుణ్‌ మార్కెట్ మరింత దిగజారింది.

సినిమా సినిమాకి పడిపోతుండడంతో, రాజ్‌ తరుణ్‌ సపోర్టింగ్‌ రోల్స్‌కి షిఫ్ట్‌ అయ్యే టైమ్ వచ్చిందని కామెంట్ చేస్తున్నారు సినీజనాలు. 'అందాల రాక్షసి' టైమ్‌లో హంగామా చేసిన నవీన్ చంద్ర కూడా ఇలాగే ఫ్లాపులతో హీరో నుంచి సపోర్టింగ్‌ రోల్స్‌కి పడిపోయాడు. ఇప్పుడు రాజ్‌ తరుణ్‌ సినిమా కూడా ఇలాగే మారిపోయేలా కనిపిస్తుంది అంటున్నారు.  

మొత్తానికి కుర్ర హీరో రాజ్ తరుణ్ సినీ కెరీర్ చివరికి చేరుకుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ హీరో.. కథానాయిక పాత్రలకు స్వస్తి చెప్పి సపోర్టింగ్ పాత్రలు చేస్తే బాగుంటుందని సినీ జనాలు అనుకుంటున్నారు. ఇంకెన్ని ప్రయత్నాలు చేసినా వృథా అనీ.. మరో ఆప్షన్ వెతుక్కోవాలని సలహాలు ఇచ్చేస్తున్నారు. మరి నెటిజన్ ల మాటలను రాజ్ తరుణ్ పట్టించుకుంటాడా.. లేక.. తన మొండి వైఖరిని కొనసాగిస్తాడేమో చూడాలి.






మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: