ప్రభాస్ ఆదిపురుష్ సినిమాలో సీత క్యారెక్టర్ పై క్లారిటీ ఇచ్చిన అనుష్క...

frame ప్రభాస్ ఆదిపురుష్ సినిమాలో సీత క్యారెక్టర్ పై క్లారిటీ ఇచ్చిన అనుష్క...

Purushottham Vinay
యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌కి నేషనల్‌, ఇంటర్నేషనల్‌ వైడ్‌ ఫ్యాన్‌ బేస్‌ వుంది. బాహుబలి తో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్ లో బాగా పాపులర్ అయ్యాడు. అలాగే, అనుష్కకు సపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ వుంది. కపుల్‌గా వీళ్ళిద్దరికీ సపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ వుంది. వాళ్ళకు ఓ శాడ్‌ న్యూస్‌. బిల్లా, మిర్చి, బాహుబలి సినిమాలలో ప్రభాస్‌, అనుష్క మధ్య కెమిస్ట్రీ సిల్వర్‌ స్ర్కీన్‌ మీద కేక పుట్టించింది. అభిమాన జోడీ మరోసారి కలిసి యాక్ట్‌ చేస్తే చూడాలనుకున్న వాళ్ళకి ‘ఆదిపురుష్‌’ రూపంలో ఓ న్యూస్‌ వచ్చింది.ఇక ఇండియా హెరాల్డ్ అందిస్తున్న పూర్తి విషయాలు చూసినట్లయితే...

రామాయణాన్ని బేస్‌ చేసుకుని బాలీవుడ్‌ డైరెక్టర్‌ ఓమ్‌ రౌత్‌ తియ్యనున్న ఆ సిన్మాలో సీతగా అనుష్క యాక్ట్‌ చెయ్యవచ్చని వచ్చిన న్యూస్‌ ప్రభాస్‌, అనుష్క అభిమానులకు ఆనందాన్ని ఇచ్చింది. స్వీటీ అలియాస్‌ అనుష్క మాత్రం అటువంటిది ఏమీ లేదని తేల్చి చెప్పారు. అనుష్క లీడ్‌ క్యారెక్టర్‌లో యాక్ట్‌ చేసిన ‘నిశ్శబ్దం’ అక్టోబర్‌ 2న రిలీజ్‌ అవుతున్నది. ఈ సందర్భంగా టాలీవుడ్‌ మీడియాతో జూమ్‌ యాప్‌లో ఇంటరాక్షన్‌ ప్రోగ్రామ్‌ జరిగింది. అప్పుడు ‘‘మీరు ప్రభాస్‌ ‘ఆదిపురుష్‌’లో సీత క్యారెక్టర్‌ చెయ్యనున్నట్టు న్యూస్‌ వచ్చింది.

అందులో నిజమెంత?’ అని అనుష్కను అడగ్గా… ‘‘లేదండీ! నా వరకూ ఏదీ రాలేదు. ఆ టాపిక్‌ అసలు రాలేదు. మా మధ్య డిస్కషన్లు జరగలేదు’’ అని చెప్పారు. దీనిబట్టి ప్రస్తుతానికి ‘ఆదిపురుష్‌’లో ప్రభాస్‌, అనుష్కను కపుల్‌గా చూసే అవకాశం లేదని చెప్పుకోవాలి. రెండు నెలలుగా న్యూ స్టోరీలు వింటున్నానని అనుష్క చెప్పారు. రెండు కథలు తనను ఆకట్టుకున్నాయని ఆవిడ అన్నారు. కొత్త సిన్మాలను ప్రొడ్యూసర్లు అనౌన్స్‌ చేస్తారని, డైరెక్టర్లు ఎవరనేదీ ప్రొడ్యూసర్లే చెప్తారని అనుష్క చెప్పారు. అప్పటివరకు తాను చెప్పనని ఆమె చెప్పారు.

ప్రభాస్ ప్రస్తుతం "రాధే శ్యాం" సినిమా చేస్తున్నాడు. జిల్ ఫేమ్ రాధాకృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: