బిగ్ బాస్ లో మరో వైల్డ్ కార్డ్.. ఐపిఎల్ ముందు నిలబడాలంటే తప్పదు మరి..!

shami
బిగ్ బాస్ సీజన్ 4లో 16 మంది కంటెస్టంట్స్ తో మొదలైన ఈ షో రెండు వారాల్లో ఇద్దరు కొత్త వాళ్ళను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చేలా చేశారు. ఈసారి ఐపిఎల్ సీజన్ ను తట్టుకునేందుకు బిగ్ బాస్ బిగ్ ప్లాన్ వేసినట్టు తెలుస్తుంది. కుమార్ సాయి, జబర్దస్త్ అవినాష్ ఇద్దరు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ హౌజ్ లోకి వెళ్ళగా కొత్తగా హీరోయిన్ స్వాతి దీక్షిత్ ను కూడా హౌజ్ లోకి పంపించాలని ఫిక్స్ అయ్యారట.  

తెలుగులో ఒకటి రెండు సినిమాలు చేసిన స్వాతి దీక్షిత్ సైడ్ రోల్స్ లో కూడా నటించింది. ఇప్పటికే ఈ సీజన్ లో గ్లామర్ డోస్ ఎక్కువవగా దాన్ని మరింత పెంచి ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే బుల్లితెర ఆడియెన్స్ నైట్ తొమ్మిదిన్నర అయ్యిందంటే చాలు బిగ్ బాస్ కు ట్యూన్ చేస్తున్నారు. అయితే యూత్ ఆడియెన్స్ ను బిగ్ బాస్ చూసేలా ఇప్పుడు మరో అందాల భామని హౌజ్ లోకి పంపిస్తున్నారని తెలుస్తుంది.

హౌజ్ లో ఇప్పటికే 16 మంది ఇంటి సభ్యులు ఉన్నారు. ఈ వారం ఒకరు లేదా ఇద్దరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సులు ఉన్నట్టు తెలుస్తుంది. ఈ వారం నామినేషన్స్ లో ఏడుగురు హౌజ్ మేట్స్ ఉన్నారు. నామినేషన్స్ లో స్ట్రాంగ్ కంటెస్టంట్స్ ఉన్న దేవి నాగవల్లి, లాస్య కూడా ఉన్నారు. వీరు ఎలాగు సేవ్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ కుమార్ సాయి, మెహబూబ్, మోనా, హారికలలో ఈ వారం ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సులు ఉన్నట్టు తెలుస్తుంది. అరియానా కూడా ఈ వారం నామినేషన్స్ లో ఉంది.                                 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: