డబ్బులిచ్చి 'ఢీ' జడ్జి గా రావాలి.. సుదీర్, రష్మీ పరమ వేస్ట్..?
ఇక ఇటీవల విడుదలైన ప్రోమో లో కూడా బాబా భాస్కర్ తనదైన శైలిలో మరోసారి సందడి సందడి చేశారు. ప్రతి ఒక్కరి పై పంచులు వేస్తూ ఆడుకున్నాడు. ముఖ్యంగా సుధీర్ పై పంచులతో ఓ ఆటాడుకున్నాడు బాబా భాస్కర్ మాస్టర్. వాళ్ళు అంత కష్టపడి మంచి పర్ఫామెన్స్ చేస్తూ ఉంటే కరోనా పేషెంట్ లా సైలెంట్ గా కూర్చున్నావ్ ఏంట్రా.. ఏమైనా ఫైల్స్ ఉన్నాయా అంటూ సుధీర్ పై కామెంట్ చేశాడు బాబా భాస్కర్ మాస్టర్. నువ్వు డబుల్ వేస్ట్ రష్మి... త్రిబుల్ బెస్ట్ అంటూ మరో పంచ్ కూడా వేశాడు.
వెంటనే కల్పించుకున్న హైపర్ ఆది మరి వర్షిని మాస్టర్ అడగ్గానే.. వర్షిని టోటల్ వేస్ట్ అంటూ.. గాలి తీసేసాడు బాబా భాస్కర్. తర్వాత సుధీర్ రెచ్చిపోయి మరి గుద్దు గుద్దు గుద్దు అంటూ అరుస్తాడు... నువ్ అరిచిన వేస్టే అంటూ సుధీర్ గాలి తీసేస్తాడు బాబాబాస్కర్ మాస్టర్. అయితే ఢీ షో లో ఎంతో అద్భుతంగా డాన్స్ చేస్తారని... షో కి డబ్బులు ఇచ్చి మరీ జడ్జీలుగా పిలుస్తారని అలా కాకుండా మనమే డబ్బులు ఇచ్చి జడ్జీలుగా రావాలి అంటూ చెప్పుకొచ్చాడు బాబా భాస్కర్ మాస్టర్. దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయి ఎంతో మందిని ఆకర్షిస్తోంది.