కంగనాకు పెరుగుతున్న సపోర్ట్.. !
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ సుశాంత్ మరణం తర్వాత సుశాంత్ కి సపోర్ట్ గా బాలీవుడ్ మాఫియాపై యుద్ధమే చేస్తుంది. ఈ డ్రగ్స్ కేసు గురించి మాట్లాడుతూ బాలీవుడ్ స్టార్ హీరోలందరూ డ్రగ్స్ తీసుకుంటారని, అందరికీ నార్కోటిక్ పరీక్షలు నిర్వహించాలని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ విషయంలో ఫైర్ బ్రాండ్ కంగనా ఎవ్వరికీ భయపడకుండా ఒకే స్టాండ్ మీద ఉండడంతో నెటిజన్లు ఆమెకు సపోర్ట్ గా నిలుస్తున్నారు.
బాలీవుడ్ టాప్ హీరోలైన రణవీర్ సింగ్, రణబీర్ కపూర్ తో పాటు అయాన్ ముఖర్జీ, విక్కీ కౌశిక్ లు డ్రగ్ టెస్ట్ కోసం బ్లడ్ శాంపిల్స్ ఇవ్వాలని కోరుతున్నానంటూ కంగనా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వీరు నలుగురూ కొకైన్ వాడతారనే ప్రచారం బాలీవుడ్ లో ఉందని అందుకుగాను డ్రగ్ టెస్ట్ చేయించుకుని తమపై పడిన అపవాదును వారు తొలగించుకోవాలని చెబుతుంది. రక్త పరీక్షల్లో వారికి క్లీన్ రిపోర్ట్ వస్తే లక్షలాది మందికి స్ఫూర్తిదాతలుగా అవతరిస్తారని చెబుతూ ... సోషల్ మీడియాను ప్రధాని మోదీ కార్యాలయానికి ట్యాగ్ చేయడం విశేషం.
కంగనా చాలా కాలంగా బాలీవుడ్ లోని ఓ టాప్ హీరోని టార్గెట్ చేస్తూ వస్తుంది.దానిలో భాగంగా బాలీవుడ్లో దాదాపు 99 శాతం మంది డ్రగ్స్ తీసుకుంటారని కంగనా బాంబ్ పేల్చింది. ఓ ప్రముఖ హీరో డ్రగ్స్ అధిక మోతాదులో తీసుకోవడంతో ఆయన ఆరోగ్యం క్షీణించిందని.. ఆ తర్వాత ఆసుపత్రిలో చేరాడని, అతని ప్రవర్తనను భరించలేక ఆ హీరో భార్య.. అతని నుండి విడాకులు కూడా తీసుకుందని పేర్కోంది. కంగనా ఇంకా మాట్లాడుతూ విడాకులు అయినా తర్వాత ఆ హీరోతో తాను డేటింగ్ కూడా చేశానని తెలిపింది.