హారికా హాసిని కి సమస్యగా మారిన త్రివిక్రమ్ జూనియర్ ల వ్యూహాత్మక మౌనం ?
‘అల వైకుంఠపురములో’ ఇండస్ట్రీ హిట్ గా మారిన తరువాత ఈమూవీ నిర్మాణ సంస్థ హారికా హాసిని అదే స్పీడ్ ను కొనసాగించాలని జూనియర్ త్రివిక్రమ్ ల కాంబినేషన్ తో మూవీ ప్రాజెక్ట్ ప్రకటించింది. వాస్తవానికి ఈమూవీ ఈసంవత్సరం చివరిలో ప్రారంభం అయి వచ్చే ఏడాది విడుదల అయ్యేలా యాక్షన్ ప్లాన్ డిజైన్ చేయడం కూడ జరిగింది.
అయితే కరోనా పరిస్థితులతో షూటింగ్ లు ఆగిపోవడంతో ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ షూటింగ్ మళ్ళీ ఎప్పుడు మొదలవుతుందో తెలియని పరిస్థితి. ఇప్పుడిప్పుడే హీరోలు ధైర్యంతో షూటింగ్ స్పాట్స్ కు వస్తున్నా ప్రస్తుతం ఉన్న నిబంధనల రీత్యా ‘ఆర్ ఆర్ ఆర్’ లాంటి భారీ మూవీ షూటింగ్ జరపడం రాజమౌళికి కూడ సమాధానం లేని ప్రశ్నగా మారింది.
దీనితో త్రివిక్రమ్ జూనియర్ ల మూవీ ప్రాజెక్ట్ షూటింగ్ వచ్చే ఏడాదికి వాయిదా పడిపోయింది. ఇలాంటి పరిస్థితులలో హారికా హాసినీ త్రివిక్రమ్ ను ఒక ఏడాది ఖాళీగా ఉంచే కంటే వెంకటేష్ తో ఒక మూవీని వేగంగా పూర్తి చేస్తే బాగుంటుంది అన్న ఆలోచనలలో ఉన్నట్లు టాక్.
ఇప్పటికే లీకులు వస్తున్న పరిస్థితులలో జూనియర్ వైపు నుండి తనకు అభ్యంతరం లేదు అన్నట్లుగా ఒకసందేశం వస్తే బాగుంటుంది అన్న అభిప్రాయం హారికా హాసినీ సంస్థ నిర్మాతలకు ఉన్నట్లు టాక్. ఈ విషయమై కనీసం త్రివిక్రమ్ కలగచేసుకుని జూనియర్ తో రాయబారాలు చేసినా బాగుంటుందని హారికా హాసినీ నిర్మాతలు బావిస్తున్నా త్రివిక్రమ్ మాత్రం ఈవిషయమై జునియర్ తో రాయబారాలు చేయడానికి అంత సుముఖంగా లేడు అని గాసిప్పులు వస్తున్నాయి. దీనితో త్రివిక్రమ్ జూనియర్ ల వ్యూహాత్మక మౌనంతో వెంకటేష్ తో హారికా హాసినీ నిర్మించాలని భావిస్తున్న మూవీ విషయం ముందడుగు వేయాలా లేకుంటే జూనియర్ త్రివిక్రమ్ ల మూవీ పూర్తి అయ్యేవరకు తాము కూడ మౌనంగా ఉండాలా అనే విషయమై ఎటూ తేల్చుకోలేక నిర్మాతలు కన్ఫ్యూజ్ అవుతున్నట్లు టాక్..