పునరావృతం కాబోతున్న నవలా చిత్రాల సీజన్ !

Seetha Sailaja
సినిమాలను భారీ తారాగణంతో ఎంత కష్టపడి తీసినా మూల కథ బాగుండకపోతే ప్రేక్షకులు రిజక్ట్ చేస్తూనే ఉంటారు. గతంలో తెలుగు నవలలను నవలా చిత్రాలుగా మార్చి అనేకమంది నిర్మాతలు సూపర్ హిట్స్ అందుకున్నారు. ‘ప్రేమనగర్’ ‘సెక్రటరీ’ ‘బలిపీఠం’ ‘మీనా’ ‘అభిలాష’ ‘జీవనతరంగాలు’ లాంటి ఎన్నో పాపులర్ నవలలు సినిమాలుగా మారాయి.

అయితే ఇప్పుడు మళ్ళీ అటువంటి నవలల సినిమాల సీజన్ మళ్ళీ మొదలు కాబోతోందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ప్రస్తుతం వెంకటేష్ హీరోగా నటిస్తున్న ‘నారప్ప’ మూవీ ‘అసురన్’ కు రీమేక్ అయినప్పటికీ తమిళంలో వచ్చిన ఒక ప్రముఖ నవల ఆధారంగా తీయబడుతోంది. ఒకప్పుడు ప్రముఖ డిటెక్టివ్ రచయిత మధుబాబు వ్రాసిన ‘షాడో’ నవల ఇప్పుడు సినిమాగా రాబోతోంది.

ఈమూవీలో ఒక ప్రముఖ హీరో నటిస్తాడని ప్రచారం జరగబోతోంది. ‘బాహుబలి’ రికార్డులను బ్రేక్ చేయాలని ప్రయత్నిస్తున్న మణిరత్నం లేటెస్ట్ గా తీసుతున్న భారీ మూవీ ప్రాజెక్ట్ ‘పొన్నియిన్ సెల్వన్’ ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి వ్రాసిన చారిత్రాత్మక నవల ఆధారంగా తీస్తున్నారు. ఈమధ్య ప్రముఖ రచయిత కదీర్ బాబు వ్రాసిన మెట్రో కథలు వెబ్ సిరీస్ గా ‘ఆహా’ నిర్మించిన సంగతి తెలిసిందే. అదేవిధంగా చలం వ్రాసిన మైదానం నవల త్వరలో సినిమాగా రాబోతోంది.

దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ బండి నారాయణ స్వామి వ్రాసిన సప్తభూమి నవల సినిమాగా తేవడానికి ఇంద్రగంటి ప్రయత్నిస్తున్నాడు. అదికుదరకపోతే వెబ్ సిరీస్ గా తీయడానికి ఇంద్రగంటి ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం తెలంగాణ యాసకు అక్కడి సాంప్రదాయాలకు బాగా ప్రాముఖ్యత పెరిగిన పరిస్థితులలో నిజాం పోరాటంతో ముడిపడి ఉన్న ‘ఒక నజియా కోసం’ నవలను ఒక ప్రముఖ దర్శకుడు కొన్నట్లు తెలుస్తోంది. ఇలా అనేక నవలలు సినిమాలుగా మారి రావడం వెనుక ఒక కారణం ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియా అందరికీ అందుబాటులో ఉండటంతో రచయితలు ఏ కథను కాపీ కొట్టి సినిమాగా కథగా మార్చినా వెంటనే తెలిసిపోతోంది. దీనితో ఈ తలనొప్పులు ఎందుకని సినిమా రచయితలు ఈ కాపీ వ్యవహారాలు పక్కకు పెట్టి నవలా సినిమాల ట్రెండ్ ను మళ్ళీ తెరపైకి తీసుకు వస్తున్నారు అనుకోవాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: