పాన్ ఇండియన్ వైపు మన స్టార్ హీరోలు..!

NAGARJUNA NAKKA
ప్రపంచమే ఒక మార్కెట్ అనే మాటని ఇప్పుడు గట్టిగా నమ్ముతున్నారు స్టార్ హీరోలు. ఇన్నాళ్లు ఇండియన్ మార్కెట్ ని పెద్దగా పట్టించుకోని హీరోలు కూడా ఇప్పుడు పాన్ ఇండియన్ మూవీస్ పై ఫోకస్ పెడుతున్నారు. టాలీవుడ్ ని దాటిపోమని చెప్పినోళ్లు కూడా ట్రెండ్ లో కలిసిపోతున్నారు. పాన్ ఇండియన్ పాటలు పాడుతున్నారు.
మహేశ్ బాబుని బాలీవుడ్ ఎంట్రీ గురించి ఎవరు అడిగినా నో ఛాన్స్ అన్నట్లుగానే మాట్లాడేవాడు. టాలీవుడ్ లో హ్యాపీగా ఉన్నాను, ఇలాగే ఉండనివ్వండని చెప్పేవాడు. అలాంటి మహేశ్ ఇప్పుడు, పాన్ ఇండియన్ మూవీ చేస్తున్నాడు. ‘సర్కారు వారి పాట’ని నార్త్ లోనూ రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’కి బాలీవుడ్ కోటింగ్ ఇస్తున్నారట దర్శకనిర్మాతలు. నార్త్ మార్కెట్ కి ప్లస్ అయ్యేలా ఈ సినిమాలో విలన్ గా అనిల్ కపూర్ ని తీసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. సో ఈ సినిమాతోనే మహేశ్ బాబు బాలీవుడ్ లో అడుగుపెట్టబోతున్నాడని చెప్పొచ్చు.
పవన్ కళ్యాణ్ కూడా బాలీవుడ్ ప్లాన్స్ లో ఉన్నాడు. క్రిష్ దర్శకత్వంలో చేస్తోన్న హిస్టారికల్ డ్రామా మల్టీలింగ్వల్ గా తెరకెక్కబోతోంది. అందుకే ఈ సినిమాలో హీరోయిన్ గా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ లాంటి బాలీవుడ్ బ్యూటీస్ ని పరిశీలిస్తున్నారనే టాక్ వస్తోంది
.మొత్తానికి స్టార్ హీరోలకు ప్రపంచ మార్కెట్ పై కన్నుపడింది. ఇప్పటి వరకు బాలీవుడ్ కే పరిమితమైన వీరి ఆలోచనలు ఇపుడు జాతీయ స్థాయి దాటి అంతర్జాతీయ స్థాయికి వెళ్లేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.తన టాలెంట్ ఏంటో చూపించి ఇంటర్నేషనల్ స్థాయిలో క్రేజ్ సంపాదించుకోవాలని చూస్తున్నారు. ఇప్పటి వరకు టాలీవుడ్ కే పరిమితమైన సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా.. పాన్ ఇండియన్ వైపు పరుగులు పెడుతుండటం ఆయన అభిమానుల్లో ఆశ్చర్యం రేకెత్తిస్తోంది.
సర్కారు వారి పాటను ఉత్తరాదిన రిలీజ్ చేసి టాలీవుడ్ సత్తా ఏంటో చాటేందుకు ఆ మూవీ యూనిట్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: