బిగ్ బాస్ డే 2 : 14 మంది మీద కోపంతో ఊగిపోయిన ఆ ఇద్దరు..!

shami
బిగ్ బాస్ మొదలైంది అనగానే ఎవరి ఆట వారు మొదలుపెట్టినట్టే లెక్క. 16 మందిని సెలెక్ట్ చేయగా ఇద్దరిని మాత్రం స్పెషల్ రూం లో ఉంచారు. ఇస్మార్ట్ సోహెల్, అరియానాలను సెపరేట్ రూం లో పెట్టేసరికి రెండు రోజులు వారు ఇద్దరే బిగ్ బాస్ హౌజ్ లో ఉండి లేనట్టుగా ఉన్నారు. ఇక మొదటిరోజు సోహేల్ హౌజ్ మేట్స్ కు ఫోన్ చేసి తాను బిగ్ బాస్ అని చెప్పి ఎలాగోలా ఫుడ్ తెప్పించుకున్నాడు. అయితే ఈరోజు మాత్రం అరియానా ఫోన్ మాట్లాడినా ఇంటి సభ్యులు సరిగా స్పందించక ఫుడ్ పంపించలేదు

ఈ క్రమంలో ఈరోజు మిడ్ నైట్ వాళ్లని హౌజ్ మెట్స్ ఉన్న దగ్గరకు పంపించాడు బిగ్ బాస్. రోజు మొత్తం ఆకలితో ఉండటం వల్ల సోహేల్ కొద్దిగా ఆవేశాన్ని చూపించినట్టు ప్రోమోలో తెలుస్తుంది. 14 మంది మీద సోహేల్ ఊగిపోతుండగా అతనికి సమాధానంగా అభిజిత్ వాగ్వివాదానికి దిగాడు. సోహేల్ ను నువ్వు అలా మాట్లాడొద్దు అన్నాడు.. అభిజిత్ కూడా ఆవేశంతో ఊగిపోయాడు. చూస్తుంటే బుధవారం ఎపిసోడ్ హౌజ్ మొత్తం హాట్ హాట్ గా ఉండేలా కనిపిస్తుంది.

హౌజ్ మేట్స్ తో ఎలాగైనా ఫుడ్ తెప్పించుకోవడం సెపరేట్ రూం లో ఉన్న ఇద్దరి పని. కాకపోతే అనవసర డిస్కషన్ చేసి ఫుడ్ లేకుండా చేసుకున్నారు. ఈ ఆవేశంతో లోపలకి వెళ్ళి గొడవ పడ్డారు. అభిజిత్ వర్సెస్ సోహేల్ బుధవారం ఎపిసోడ్ అదిరిపోయేలా ఉంది. మరి ఈ గొడవ ఎంతకు దారి తీస్తుంది.. గొడవకు సపొర్ట్ చేసిన వారు ఎవరు.. ప్రేక్షక పాత్ర వహించింది ఎవరు.. దీని పర్యావసానాలు ఎలా ఉండనున్నాయి అన్నది తెలియాల్సి ఉంది.                                     

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: