జయప్రకాష్ రెడ్డికి పేరు తెచ్చిన సినిమాల విశేషాలు..

Satvika
తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక ముద్రను వేసుకున్న కమెడియన్ జయప్రకాష్ రెడ్డి ఇక లేరు..ఈరోజు ఉదయం గుండె పోటుతో మరణించారు. ఉదయం బాత్ రూమ్ కు వెళ్ళిన ఆయన ఒక్కసారిగా గుండెపోటు రావడంతో అక్కడే కుప్పకూలిపోయారు.వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు అతన్ని ఆసుపత్రికి తరలించే లోపే ప్రాణాలను విడిచారు.లాక్‌డౌన్ కారణంగా సినిమా షూటింగ్‌లపై ప్రభుత్వం నిషేధించడంతో అప్పటి నుంచి ఆయన గుంటూరులో ఉన్న తన స్వగృహం లోనే ఉంటున్నారు. జయప్రకాశ్ రెడ్డి మరణ వార్త తో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి.

చిత్ర పరిశ్రమలో ఆయనతో సన్నిహితంగా ఉన్న వాళ్ళు, సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఈయన కర్నూల్ జిల్లా  ఆళ్లగడ్డ మండలం సిరివెల్ల గ్రామంలో జన్మించారు. ఎస్సైగా కొద్దీ సంవత్సరాలు పని చేసిన ఆయన నాటక రంగాల మీద మోజు తో ఇటు సైడ్ వచ్చేశాడు.ఆయన ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు బ్రహ్మపుత్రుడు సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు. ఆయనకు నటకాలంటే ఆసక్తి. రాయలసీమ మాండలికంలో కమెడియన్‌గా, విలన్‌గా, కారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినిమా చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.

1997 లో వచ్చిన ప్రేమించుకుందాం రా సినిమాలో నటించి ప్రేక్షకుల మనసును దోచుకున్నాడు.  ఆ తర్వాత బాలకృష్ణ సినిమా సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, జయం మనదేరా, విజయరామరాజు, చెన్నకేశవ రెడ్డి, పలనాటి బ్రహ్మనాయుడు, నిజం, సీతయ్య వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ చిత్రాలలో నటించాడు.ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన సినిమాల లిస్ట్ చాలానే ఉన్నాయి. సినీ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి హీరో తో పనిచేసిన అనుభవం ఉంది. రాయలసీమ యాసలో ప్రాణం పోసిన ఘనత ఆయనకే సొంతం. ఆయన చివరి చిత్రం మహేష్ బాబు నటించిన సరిలేరూ నీకేవ్వరు.. ఏది ఏమైనా కూడా గొప్ప నటుడు మన మద్య లేకపోవడం బాధాకరం..ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మా హెరాల్డ్ ఛానెల్ తరపున కోరుకుంటున్నాము..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: