శివాజీ సినిమాలో నటించిన ఈ ట్విన్స్ గుర్తున్నారా?
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా సౌత్ ఇండియా సెన్సషనల్ డైరెక్టర్ గా పిలవబడే శంకర్ కాంబినేషన్లో వచ్చిన ‘శివాజీ’ చిత్రాన్ని ఎవ్వరూ మరిచిపోలేరు అనడంలో సందేహం లేదు. సౌత్ లో మొదటి 100కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించిన చిత్రంగా ‘శివాజీ’ అప్పట్లో రికార్డులు సృష్టించింది. ‘బ్లాక్ మనీ’ థీమ్ తో రూపొందిన ఈ చిత్రం తెలుగులో కూడా సూపర్ హిట్ అనిపించుకుంది.అప్పట్లోనే ఈ సినిమా ఇండియా బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులు నమోదు చేసింది. ఇండియా బాక్స్ ఆఫీస్ ఇండస్ట్రీ హిట్ గా అప్పట్లో సెన్సేషన్ సృష్టించింది ఈ చిత్రం.ఇక ఈ చిత్రంలో రజినీ హీరోయిన్ శ్రీయ వెంటపడుతున్న తరుణంలో..
శ్రీయ ఇంటి పక్కన ఉండే వ్యక్తి వచ్చి ఆయన కూతుర్లను చూపిస్తాడు. వాళ్ళు చాలా డీ గ్లామర్ గా కనిపిస్తారు. అప్పట్లో ఈ సీన్ గురించి చాలా మంది అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అందుకే వీళ్ళ రోల్ చాలా వరకూ తగ్గించారనే టాక్ కూడా ఉంది. ఇక సినిమాలో వీళ్ళ క్యారెక్టర్ పేర్లు అక్కమ్మ – జెక్కమ్మ. వీళ్ళను ఆ పాత్రల కోసమే డీ గ్లామరస్ గా చూపించారట. డార్క్ స్కిన్ టోన్ ఉండేలా వీళ్ళ లుక్ ను మార్చేశారట.
అయితే నిజ జీవితంలో వీళ్ళు అందంగానే ఉన్నారు. 13ఏళ్ళ క్రితం వచ్చిన ‘శివాజీ’ సినిమాలో వీళ్ళ లుక్ కు మరియు ఇప్పటి ఫోటోలకు ఈ లుక్ కు చాలా డిఫరెంట్ గా ఉంది. వీళ్ళ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీళ్ళు ‘శివాజీ’లో తప్ప మరో సినిమాలో నటించలేదు.
ఇక పోతే ప్రస్తుతం రజినీకాంత్ మాస్ డైరెక్టర్ గా పేరొందిన శివ దర్శకత్వం లో "అన్నాతయ్" అనే మాస్ మూవీ చేస్తున్నాడు. ఇక శంకర్ కమల్ హాసన్ తో కలిసి ఇండియన్ 2 మూవీ చేస్తున్నాడు.