ఆ ఒక్క సినిమాపైనే ఆశలు అన్నీ పెట్టుకున్న అమెజాన్ ప్రైమ్ వీడియో?

Suma Kallamadi
దిగ్గజ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో చాలా కోట్ల రూపాయలను వెచ్చించి దక్షిణ భారతదేశ సినిమాలన్నిటినీ కొనుగోలు చేస్తోంది. కీర్తి సురేష్ నటించిన పెంగ్విన్ సినిమాని కొనుగోలు చేసిన అమెజాన్ కి తీవ్ర నిరాశే మిగిలిందని చెప్పుకోవచ్చు. ఇంకా ఇటీవల కాలంలో నేరుగా విడుదలైన అనేక చెత్త సినిమాలను తమ ఓటీటీ ప్లాట్ ఫామ్ కి నెగిటివ్ ఫీడ్ బ్యాక్ ని తెచ్చిపెడుతున్నాయని ఆందోళన చెందుతున్నారు ప్రైమ్ వీడియో నిర్వాహకులు. అందుకే అర్జెంటుగా ఎలాగైనా ఒక భారీ హిట్ చిత్రాన్నీ నేరుగా తమ ఓటీటీ పైనే విడుదల చేసి రికార్డుస్థాయిలో వీక్షణలు, పాజిటివ్ ఫీడ్ బ్యాక్ లు సాధించాలని దృఢంగా నిశ్చయించుకొని నాని నటించిన వి సినిమాని అక్షరాలా ముప్పై మూడు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయలను వెచ్చించి కొనుగోలు చేసింది.

తదనంతరం దాదాపు పది రోజుల పాటు జోరుగా ప్రచారం కూడా చేసింది. ఐతే సినిమా విడుదలైన రోజు మిలియన్ల సంఖ్యలో వీక్షణలను నమోదయ్యి రికార్డులు సృష్టించాయి కానీ ఆ తర్వాత సినిమా బాగోలేదన్న టాక్ అందరి లోకి వెళ్ళిపోయింది. దాంతో అమెజాన్ ప్రైమ్ వీడియో పెట్టుకున్న ఆశలపై వి సినిమా నీళ్లు చల్లినట్లు అయ్యింది. అమెజాన్ ప్రైమ్ వీడియో లో అన్నీ చెత్త సినిమాలే విడుదల అవుతున్నాయని ప్రజలలోకి ఒక భావన వెళ్లిపోతుందేమోనని, నూతన చందాదారులు ఎవరూ కూడా రారేమోనని... ఇప్పటికీ ఆ సంస్థ భయపడుతూనే ఉందని టాక్.

అయితే గజినీ ఫేమ్ హీరో సూర్య నటించిన ఆకాశమే నీ హద్దురా సినిమా యొక్క డిజిటల్ రైట్స్ ని కొనుగోలు చేసింది అమెజాన్ ప్రైమ్ వీడియో. ఈ సినిమా అక్టోబర్ 30వ తేదీన రిలీజ్ కానున్నది. అయితే అమెజాన్ ప్రైమ్ వీడియో యాజమాన్యం మొత్తం ఈ ఒక్క సినిమా పైనే తమ ఆశలన్నీ పెట్టుకున్నారు. ఒకవేళ ఈ సినిమా గనుక ఫ్లాప్ అయితే ఇక కొత్త సినిమాలను ఎక్కువ డబ్బులు వెచ్చించి కొనుగోలు చేసేందుకు అమెజాన్ ప్రైమ్ వీడియో ఆసక్తి చూపదని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: