మెగా ప్రొడ్యూసర్ కు ఛాన్స్ ఇవ్వని మెగాస్టార్..!

shami
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ మెగా ఫ్యాన్స్ కు మళ్ళీ పండుగ వాతావరణాన్ని తెచ్చింది. చిరుతో పాటుగా మిగతా మెగా హీరోలంతా సూపర్ ఫామ్ లో ఉన్నారు. అయితే మెగాస్టార్ చిరు పదేళ్ళ తర్వాత ఖైదీ నంబర్ 150 సినిమా చేయగా ఆ తర్వాత సైరా సినిమాతో మెప్పించారు. ప్రస్తుతం ఆచార్య సినిమాను చేస్తున్నారు మెగాస్టార్. అయితే ఈ మూడు సినిమాలు కొణిదెల ప్రొడక్షన్ లోనే చేయడం విశేషం. ఆచార్యకు మాత్రమే నిరంజన్ రెడ్డి నిర్మాతగా చెబుతున్నారు.    

10 ఇయర్స్ సినిమాలకు గ్యాప్ ఇచ్చిన చిరు రీ ఎంట్రీ తర్వాత అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ లో ఒక్క సినిమా కూడా చేయలేదు. తనయుడు నిర్మాతగా మారడంతో నిన్నటిదాకా సొంత బ్యానర్ అనుకున్న గీతా ఆర్ట్స్ ఇప్పుడు బయట బ్యానర్ అయ్యిందా అని అందరు అనుకుంటున్నారు. మూడు సినిమాల్లో ఏది గీతా ఆర్ట్స్ తో సంబంధం లేదు.. ఇక రాబోయే సినిమాలకు సంబంధించి కూడా చిరు బర్త్ డే నాడు ఎనౌన్స్ చేస్తారని అనుకుంటే అది జరగలేదు.

ఒకవేళ గీతా ఆర్ట్స్ లో చిరు సినిమా కన్ఫర్మ్ అయితే తప్పకుండా మొన్న చిరు బర్త్ డే రోజు ప్రకటించి ఉండేవారని అంటున్నారు. సో మెగాస్టార్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కు ఛాన్స్ ఇవ్వట్లేదని తెలుస్తుంది. అయితే సరైన కాంబినేషన్ కుదరకనే అల్లు అరవింద్ తో చిరు సినిమా ఫిక్స్ అవట్లేదని అంటున్నారు. పేరుకి కొణిదెల ప్రొడక్షన్ అని పెట్టినా ఆ సినిమా నిర్మాతగా చరణ్ కు కావాల్సిన సహకారం మేనమామ అల్లు అరవింద్ అందిస్తున్నాడని అంటున్నారు. ఏదైనా గీతా ఆర్ట్స్ లో చిరు సినిమా వస్తే చూడాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి అది ఎప్పుడు జరుగుతుందో చూడాలి.            

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: