వాట్స్ రాంగ్ విత్ అనుపమ.. ఛాన్సులు వచ్చినట్టే వచ్చి..!

shami
మళయాళ ప్రేమం సినిమాతో అలరించిన అనుపమ ఆ సినిమా తర్వాత సౌత్ లో క్రేజ్ తెచ్చుకోగా ఆ రీమేక్ కు ముందే త్రివిక్రం అఆలో నటించి మెప్పించిన అమ్మడు స్టార్ హీరోయిన్ అవడం ఖాయమని అనుకున్నారు. అందం, అభినయం రెండు ఉన్నా సరే అమ్మడికి లక్ కలిసి రావట్లేదు. తెలుగులో ముందు అ ఆ ఆ తర్వాత ప్రేమం తెలుగు రీమేక్ ఇలా రెండు క్రెజీ సినిమాలతో వచ్చిన ఈ అమ్మడు ఆ తర్వాత శతమానం భవతి హిట్ తో ఫామ్ లోకి వచ్చింది.

ఆ తర్వాత అనుపమ తెలుగులో చేసిన నాలుగు సినిమాలు వర్క్ అవుట్ కాలేదు. లాస్ట్ ఇయర్ రాక్షసుడు సినిమాతో హిట్ అందుకున్న అనుపమ తెలుగులో ఒకటి రెండు ఛాన్సులు చేతి వరకు వచ్చి మిస్ అయ్యాయి. రాం చరణ్ రంగస్థలం సినిమాలో సమంత పాత్రలో ముందు అనుపమని అనుకున్నాడు సుకుమార్. కాని ఫోటో షూట్ లో ఆమె వర్క్ అవుట్ అవదని తెలిసి ఆమె ప్లేస్ లో సమంతని ఫిక్స్ చేశారు.

ఇక లేటెస్ట్ గా నిఖిల్ హీరోగా చేస్తిన్న 18 పేజెస్ సినిమాలో కూడా ముందు అనుపమ పరమేశ్వరన్ ను హీరోయిన్ గా అనుకున్నారు. క్రేజీ లవ్ స్టోరీగా వస్తున్న ఈ సినిమాతో అమ్మడు మళ్ళీ ఫాం లోకి వస్తుందని అనుకున్నారు కాని ఆమె ఆ ఛాన్స్ కూడా మిస్సైందని తెలుస్తుంది. 18 పేజెస్ లో అనుపమ బదులుగా నాని గ్యాంగ్ లీడర్ హీరోయిన్ ప్రియాంకా అరుల్ మోహన్ కు ఛాన్స్ ఇచ్చారట.

తనంతట తాను కాదంటుందో లేక వాళ్ళకి నచ్చక తీసేస్తున్నారో కాని అనుపమ విషయంలో మాత్రం ఏదో జరుగుతుంది. అమ్మడు కెరియర్ సరైన ప్లానింగ్ తో లేదన్నది మాత్రం అర్ధమవుతుంది. మరి కరెక్ట్ సినిమా పడితే సత్తా చాటాలని అనుకుంటున్న అమ్మడు ఆ సినిమాను ఎంపిక చేసుకోవడంలో తన టాలెంట్ చూపించాల్సిన అవసరం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: