ఆది పురుష్ మూవీలో సీతగా కియారా అద్వానీ ఎంపిక?

VAMSI
రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి సినిమా తో పాన్ ఇండియా హీరోగా తన సత్తా చాటుకున్నాడు హీరో ప్రభాస్... ఇక అప్పటినుండి ప్రతి సినిమాని ఎంతో జాగ్రత్తగా ఎంచుకుంటూ భారీ సినిమాల వైపు మొగ్గు చూపుతున్నాడు డార్లింగ్. ప్రస్తుతం ప్రభాస్ ఆది పురుష్  సినిమా లో చేస్తున్న విషయం విధితమే. దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో పౌరాణిక నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే రామాయణాన్ని ఆధారం చేసుకొని తెరకెక్కుతున్న ఈ చిత్రం లో రాముడితో పాటు, సీత పాత్రకు కూడా ఎంత విలువ ఉంటుందో అందరికీ తెలిసిందే... అయితే ఆ పాత్రకు తగ్గట్టు అందం అభినయంతో పాటు నవరసాలను, ముఖ హావభావాలతో వ్యక్తం చేయగల ఒక సస్యశ్యామలమైన రూపం ఉన్న కథానాయకి కావాలి.




గత కొంత కాలంగా ఆది పురుష్ సినిమాలో సీత పాత్రకు పలువురు హీరోయిన్ల పేర్లు చెప్పుకొచ్చారు... తాజాగా ఈ క్యారెక్టర్ కు బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే ను ఎంపిక చేసారని వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం ఆ పాత్రకు మహేష్ బాబు హీరోయిన్ కియారా అద్వాని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.. ఈ సినిమా ముఖ్యంగా హిందీ, తెలుగు, తమిళ భాషలలో తీయనున్న కారణంగా అటు బాలీవుడ్ లోనూ, ఇటు టాలీవుడ్ లోనూ ప్రేక్షకుల మనస్సును టచ్ చేసిన హీరోయిన్ గా కియారాను ఫైనల్ చేసినట్లు సమాచారం.





అది కాక కియారా అద్వానీ సీత పాత్రకు ఇట్టే ఇమిడిపోతుందని కొందరు సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారట. అటు మోడ్రన్ డ్రెస్ కి కరెక్ట్ గా ఫిట్ అయ్యే కియారా ఇటు చీరకట్టుతో దేవతలా కనిపిస్తూ సీతమ్మ ను తలపించగల అద్భుత నటి అంటూ ప్రశంసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు సీతమ్మ పాత్ర లో చక్కగా ఇమిడిపోగల ఆహార్యం ఉన్న ఈ ఇద్దరు  కథానాయకులలో ఎవరు ఫైనల్స్ కు చేరుకుంటారా అన్న విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయింది. త్వరలోనే ఈ విషయంపై ఓ క్లారిటీ ఇవ్వనుంది ఆది పురుష్ సినీ బృందం. ప్రస్తుతం ఈ చిత్రంలోని కీలక నటీనటులను ఎంపిక చేసే పనిలో పడింది ఆది పురుష్ టీం. ఇప్పటికే ఇందులో ప్రతినాయకుడి పాత్రకు బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ ను ఖరారు చేయగా మరికొందరు బాలీవుడ్ నటులకు సినిమాలో చోటు దక్కనుంది అని సమాచారం. ఇటు టాలీవుడ్ నుంచి కూడా పలువురు ప్రముఖ నటులకు ఇప్పటికే పిలుపు వచ్చిందట... మరి వారు ఎవరు ఏ పాత్రలు చేయబోతున్నారు అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: