కుందనపు బొమ్మా.. కాజల్ అగర్వాల్..!

shami
చందమామ కాజల్ అగర్వాల్ ఈమధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. కరోనా లాక్ డౌన్ టైంలో సెల్ఫ్ మేడ్ డిష్ లతో ఆడియెన్స్ ను అలరించిన అమ్మడు ఇప్పటికి ఇంట్లోనే హాలీడేస్ ను ఎంజాయ్ చేస్తుంది. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా హీరోయిన్స్ మాత్రం రకరకాల ఫోటో షూట్స్ తో దర్శనమిస్తారు. ఈ క్రమంలో కాజల్ అగర్వాల్ కూడా తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫోటోలతో సర్ ప్రైజ్ చేస్తుంది. లేటెస్ట్ గా రెగ్యులర్ పంజాబి వేర్ తో కనిపించి సింపుల్ గాళ్ లుక్ లో అదరగొట్టింది.  
కాజల్ ను చూసి ఏమాయ చేసావే సినిమాలో కుందనబొమ్మా హే బొమ్మా అని బ్యాక్ గ్రౌండ్ సాంగ్ మోగడం ఖాయం. లక్ష్మి కళ్యాణం నుండి తెలుగు ఆడియెన్స్ ను అలరిస్తున్న కాజల్ ఇప్పటికి టాలీవుడ్ లో క్రేజీ ఛాన్సులు అందుకుంటుంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఆచార్యతో పాటుగా శంకర్, కమల్ హాసన్ కాంబోలో వస్తున్న సూపర్ హిట్ మూవీ సీక్వల్ ఇండియన్ 2లో కూడా అమ్మడు నటిస్తుంది. ఈ రెండు సినిమాలతో మళ్ళీ కాజల్ సూపర్ ఫాం లోకి వచ్చేలా ఉంది.      
కేవలం సీనియర్ హీరోలతోనే కాదు యువ హీరోల సరసన కూడా నటిస్తున్న ఈ అమ్మడు డిఫరెంట్ రోల్స్ కు సై అంటుంది. కేవలం కమర్షియల్ సినిమాలకే కాదు కంటెంట్ ఉన్న సినిమాలకు కూడా అమ్మడు ఓకే చెబుతుంది. కాజల్ ఊపు చూస్తుంటే మరో ఐదారేళ్ళు ఇదే ఫాం కొనసాగించేలా ఉంది. మిగతా హీరోయిన్స్ కూడా ఈష్ర్య పడేలా అమ్మడికి వరుస ఛాన్సులు వస్తున్నాయి.              

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: