ప్రభాస్ సినిమాలో నివేదా పాత్ర లీక్.. ఓ పక్క హీరోయిన్ గా చేస్తూనే..!

shami
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరక్షన్ లో ప్రభాస్ 21వ సినిమా భారీ ఎనౌన్స్ మెంట్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాను వైజయంతి బ్యానర్ లో అశ్వనిదత్ నిర్మిస్తున్నారు. 500 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా సైన్స్ ఫిక్షన్స్ కథతో వస్తుందని తెలుస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా దీపిక పదుకొణెని సెలెక్ట్ చేయగా సినిమాలో నివేదా థామస్ కూడా ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే ప్రభాస్ 21వ సినిమాలో నివేదా థామస్ ప్రభాస్ కు సిస్టర్ రోల్ లో నటిస్తుందని తెలుస్తుంది.
ఓ పక్క హీరోయిన్ గా చేస్తూనే స్టార్ హీరోల సినిమాల్లో స్పెషల్ రోల్స్ చేస్తూ మెప్పిస్తుంది నివేదా థామస్. స్టార్ హీరో సిస్టర్ రోల్ చేస్తే కెరియర్ మీద ఎఫెక్ట్ పడుతుందేమో అన్న డౌట్లు ఏమి లేకుండా అమ్మడు ఈ పాత్రకు ఓకే చెప్పింది. ఇదే కాదు రజినికాంత్ దర్బార్ సినిమాలో కూడా ఆమె రజిని కూతురు పాత్రలో నటించింది. సినిమాలో నటించాలనే ఆలోచన తప్ప కేవలం హీరోయిన్ గా అయితేనే చేస్తా అని నివేదా రూల్ ఏమి పెట్టుకోలేదు.
అంతేకాదు సూపర్ స్టార్ మహేష్ 27వ సినిమాగా వస్తున్న సర్కారు వారి పాట సినిమాలో కూడా సెకండ్ హీరోయిన్ గా నివేదా థామస్ నటిస్తుందని తెలుస్తుంది. సినిమాలో కీర్తి సురేష్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా నివేదాకు సెకండ్ లీడ్ ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ప్రభాస్ నాగ్ అశ్విన్ సినిమాలో కూడా ఆమె సిస్టర్ రోల్ చేస్తుందట. మరి ఈ సినిమాలు ఆమె కెరియర్ కు ఎలాంటి క్రేజ్ తెస్తాయో చూడాలి.                                    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: