మెగా మేనల్లుడు బిగ్ ఎనౌన్స్ మెంట్..!

shami
మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ కెరియర్ మళ్ళీ గాడిన పడినట్టే అనిపిస్తుంది. సుప్రీం తర్వాత వరసగా ఆరు ఫ్లాపులు తీసిన సాయి తేజ్ చిత్రలహరి సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కాడు. ఆ తర్వాత వచ్చిన ప్రతిరోజూ పండుగే సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం సాయి ధరం తేజ్ సుబ్బు డైరక్షన్ లో సోలో బ్రతుకే సో బెటర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత దేవా కట్టా డైరక్షన్ లో సినిమా కూడా ఫిక్స్ అయ్యాడు.

దేవా కట్టా సినిమా సెట్స్ మీదకు వెళ్లకుండానే మరో సినిమాకు లైన్ క్లియర్ చేశాడు సాయి తేజ్. సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేస్తున్న కార్తిక్ డైరక్షన్ లో సాయి ధరం తేజ్ నెక్స్ట్ సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. ఈ సినిమాకు సంబందించిన ఎనౌన్స్ మెంట్ సాయి ధరం తేజ్ తన ట్విట్టర్ లో పెట్టారు. సంస్కృతంలో ఓ నోట్ పెట్టి సినిమా అప్డేట్ 14 మధ్యాహ్నం 12:06 గంటలకు అంటూ పోస్ట్ పెట్టాడు.

చూస్తుంటే మెగా మేనల్లుడు ఈసారి పెద్ద స్కెచ్చే వేసినట్టు ఉన్నాడు. అంతేకాదు రేపు అనగా 14న ప్రస్తుతం రిలీజ్ కు రెడీగా ఉన్న సోలో బ్రతుకే సో బెటర్ సినిమా గురించి ఓ స్పెషల్ అప్డేట్ కూడా వస్తుందని అంటున్నారు. సినిమాను ఓటిటిల్ రిలీజ్ చేస్తున్నామనే ఎనౌన్స్ మెంట్ వస్తుందని టాక్. మొత్తానికి కెరియర్ లో వెనక్కి తగ్గినట్టుగా కనిపించిన సాయి తేజ్ మరోసారి రేసులో దూసుకెళ్తున్నాడు. మరి ఈ సినిమాల ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.                           



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: