ప్రయోగాలను వదిలిపెట్టని రాజశేఖర్..!

NAGARJUNA NAKKA
యాంగ్రీ యంగ్ మేన్ రాజశేఖర్... రిస్క్ లు చేయడమే పనిగా పెట్టుకున్నాడు. కమర్షియల్ పంథాలో సినిమాలు చేయడం మానేసి... తనకు నచ్చిన ప్రయోగాలే అటెంప్ట్ చేస్తున్నాడు. ఈ సారి  ఒకేసారి ఏకంగా ఇద్దరు ప్రయోగాల దర్శకులతో కమిట్ కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.

యాంగ్రీ యంగ్ మేన్ రాజశేఖర్... ఎప్పటిలాగానే ఈ సారి కూడా ప్రయోగాలతోనే మన ముందుకు రావాలని డిసైడ్ అయిపోయాడు. ఇందుకు గానూ ... తనకు అచ్చొచ్చిన థీమ్ నే నమ్ముకున్నాడు. ఇప్పుడున్న సమయంలో కమర్షియల్ జోనర్  తనకు వర్కవుట్ అవ్వదనే అభిప్రాయానికి కూడా వచ్చినట్లుగా తెలుస్తోంది. కల్కితో  పెద్ద డ్యామేజ్ మూటగట్టుకున్న రాజశేఖర్... తాజాగా ఇంకో ఇద్దరు దర్శకులతో సినిమాలకు ఓకే చెప్సి హాట్ డిస్కషన్ కు కారణమయ్యాడు.
రాజశేఖర్ త్వరలో చేసే సినిమాలకు పలాస డైరెక్టర్ కరుణకుమార్, నీలకంఠలను ఎంచుకోవడం పరిశ్రమలో చర్చనీయాంశం అయింది. పలాస సినిమాను డైరెక్ట్ చేసిన కరుణకుమార్.. కంటెంట్ పరంగా సినిమాను హ్యాండిల్ చేశాడు. అందుల్లో చెప్పుకోదగ్గ పెద్ద ఆర్టిస్ట్ లు ఎవరూ లేరు. మరి రాజశేఖర్ తో సినిమా చేస్తే.. హీరో ప్రజంటేషన్ లో ఎంతవరకు అవుట్ పుట్ తేగలడు అనేది పెద్ద కొశ్చన్ మార్క్ గా  మారింది. గరుడవేగ తరహా చిత్రం ఇప్పట్లో రాజశేఖర్ కు పడుతుందా అనేది కూడా సందేహమే.
ఇక నీలకంఠ హిట్ కొట్టి పదేళ్లు పైనే అయింది. అసలు ఈ దర్శకుడు ఉన్నట్టు సినీ జనాలు కూడా మర్చిపోయారు. అలాంటి ఈ సమయంలో నీలకంఠ చెప్పిన కథ... జీవితా రాజశేఖర్ కు నచ్చే సెట్స్ మీదకు వెళ్లడానికి రెడీ అవుతుందా అనేది
తెలియాలి. నిజానికి రాజశేఖర్ పిక్ చేసుకున్న ఈ దర్శకులు కమర్శియల్ డైరెక్టర్లు కానే కారు. అయినప్పటికీ రాజశేఖర్ వీరిని ఓకే చేశాడంటే మంచి బలమైన కథనే ఎంచుకొని ఉంటారని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: