ఆ రీమేక్ పై పవన్ కన్ను..!

shami
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో రీమేక్ పై కన్నేశారు. ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమా చేస్తున్న పవన్ కళ్యాణ్ తన నెక్స్ట్ సినిమా క్రిష్ డైరక్షన్ లో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తర్వాత పవన్ మరోసారి గబ్బర్ సింగ్ కాంబో రిపీట్ చేస్తాడని అంటున్నారు. హరీష్ శంకర్ డైరక్షన్ లో పవన్ సినిమా అంటే అంచనాలు భారీ రేంజ్ లో ఉన్నాయి. ఇక ఇదేకాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో రీమేక్ పై కన్నేసినట్టు తెలుస్తుంది.
మళయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుం కోషియం సినిమా చూసిన పవన్ ఆ సినిమా రీమేక్ కు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట. స్టోరీలైన్ చాలా బాగుందని రీమేక్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ రీమేక్ ను త్రివిక్రం చేతుల్లో పెట్టాలని అనుకుంటున్నాడు పవన్. అయితే త్రివిక్రం మాత్రం ఆ రీమేక్ చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదట. పవన్ కళ్యాణ్ చేయాల్సిన సినిమాల లిస్ట్ లో ఏకే సినిమా కూడా చేరింది.
అయితే అయ్యప్పనుం కోషియం సినిమా చేస్తే పవన్ తో స్క్రీన్ షేర్ చేసుకునే హీరో ఎవరన్నది తెలియాల్సి ఉంది. అంతేకాదు పవర్ స్టార్ తో మల్టీస్టారర్ అంటే ఆ సినిమాను హ్యాండిల్ చేసే డైరక్టర్ కూడా ఎవరన్నది తెలియాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తో పాటుగా వరుస సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు. అయ్యప్పనుం కోషియం రీమేక్ కూడా ఆ లిస్ట్ లో చేరింది. మరి ఏకే సినిమాలో పవన్ ఏ రోల్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. పవన్ తో స్క్రీన్ షేర్ చేసుకునే హీరో ఎవరన్నది తెలియాల్సి ఉంది.                                  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: