మహేష్ 'సర్కారు వారి పాట'.. థమన్ చితక్కొట్టేస్తాడా..!

shami
ప్రస్తుతం తెలుగు మ్యూజిక్ డైరక్టర్స్ లో సూపర్ ఫామ్ లో ఉంది ఎవరు అంటే అది కచ్చితంగా ఎస్.ఎస్ థమన్ మాత్రమే. అల వైకుంఠపురములో సినిమాకు అద్భుతమైన మ్యూజిక్ అందించిన థమన్ ఆ సినిమా సూపర్ హిట్ అవడంలో ముఖ్య పాత్ర పోశించాడు. వైకుంఠపురం సినిమాకు మ్యూజిక్ ప్రాణంగా నిలిచింది. సాంగ్స్ తో పాటుగా రీ రికార్డింగ్ కూడా కెరియర్ బెస్ట్ ఇచ్చాడు థమన్. ఇక ఆ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేసిన థమన్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ సినిమాకు వర్క్ చేస్తున్నాడు. మహేష్, థమన్ కాంబోలో వచ్చిన దూఉకుడు, బిజినెస్ మెన్ సినిమాలు మ్యూజికల్ గా సూపర్ హిట్ అయ్యాయి.
ఇక ఇప్పుడు పరశురాం డైరక్షన్ లో వస్తున్న సర్కారు వారి పాట సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. గీతా గోవిందం తర్వాత కొద్దిగా గ్యాప్ ఇచ్చి మహేష్ తో సినిమా చేస్తున్న పరశురాం తన సినిమాలో మ్యూజిక్ పరంగా ఎప్పుడు పర్ఫెక్ట్ గా ఉండేలా ప్లాన్ చేస్తాడు పరశురాం అలానే మహేష్ సర్కారు వారి పాట సినిమాలో కూడా అదిరిపోయే మ్యూజిక్ అందించాలని చూస్తున్నాడు.
ఆగష్టు 9న మహేష్ బర్త్ డే సందర్భంగా సర్కారు వారి పాట సినిమా నుండి మొదటి సాంగ్ రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. మొదటి సాంగ్ తోనే సినిమాపై ఓ రేంజ్ క్రేజ్ వచ్చేలా చేస్తున్నారట. థమన్ కచ్చితంగా ఈ సినిమా మ్యూజిక్ ను చితక్కొట్టేస్తున్నాడని అంటున్నారు చిత్రయూనిట్. మరి ఫాం లో ఉన్నాడు కాబట్టి థమన్ మహేష్ కు అదిరిపోయే సూపర్ హిట్ ఆల్బం అందిస్తాడేమో చూడాలి. సర్కారు వారి పాట సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుందని అంటున్నారు. ఇక లేటెస్ట్ గా సినిమాలో సెకండ్ హీరోయిన్ గా విజయ్ దేవరకొండ ఫైటర్ హీరోయిన్ అనన్యా పాండేకి ఛాన్స్ ఇస్తున్నట్టు తెలుస్తుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: