పవన్ కళ్యాణ్ అన్నట్టు జరుగుతుందా..?

NAGARJUNA NAKKA

పవన్ కళ్యాణ్ కామెంట్స్ తో టాలీవుడ్ కు మరికొన్నాళ్లు నష్టాలు తప్పవనే ప్రచారం మొదలైంది. ఇప్పట్లో షూటింగ్స్ కు వెళ్లడం కష్టం అని పవన్ చెప్పగానే.. ఇండస్ట్రీ ఫ్యూచర్ పై చర్చలు మొదలయ్యాయి. 2020 మొత్తం ఊడ్చుకుపోతోందని.. ఈ ఏడాది మొత్తం సినీ కార్మికులకు కష్టాలు తప్పవనే మాటలు వినిపిస్తున్నాయి. 

 

పవన్ కళ్యాణ్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటరాక్షన్ లో రాజకీయాలతో పాటు, సినిమాల గురించి మాట్లాడాడు. ఇండస్ట్రీలో మరికొన్నాళ్లు నిశ్శబ్ధం తప్పదన్నట్టు కామెంట్ చేశాడు. కరోనా వ్యాక్సిన్ వచ్చే వరకు షూటింగ్స్ ఊపందుకోవడం కష్టమని కామెంట్ చేశాడు. పవన్ కూడా కోవిడ్-19 తగ్గే వరకు షూటింగ్స్ లో జాయిన్ కాలేనని చెప్పాడు. వకీల్ సాబ్ ని మళ్లీ వచ్చే ఏడాది సెట్స్ కు తీసుకెళ్లే అవకాశముందన్నట్టు కామెంట్ చేశాడు. 

 

షూటింగ్స్ కు దగ్గరుండి పర్మీషన్ తీసుకొచ్చిన చిరంజీవి ఆచార్యను మాత్రం హరీబరీగా మొదలు పెట్టాలనుకోవడం లేదు. రోజురోజుకీ పెరిగిపోతున్న కరోనా కేసులు చూసి, చిరుని సెట్స్ కు పంపించడం లేదు రామ్ చరణ్. పరిస్థితులు అనుకూలించే వరకు షూటింగ్స్ అనే ఆలోచనని పక్కన పెట్టేయమని దర్శకుడు కొరటాల శివకు కూడా చెప్పాడట చరణ్. ఇక ఈ మూవీని మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ తో తోకలిసి నిర్మిస్తున్నాడు రామ్ చరణ్. 

 

రెండేళ్లుగా సాగుతున్న ప్రేమ కథను వీలైనంత త్వరగా తెరెకెక్కంచాలని ప్లాన్ చేశాడు ప్రభాస్. కుదిరితే జూలై లోనే షూటింగ్ కు వెళ్లాలని సెట్స్ కూడా రెడీ చేయిస్తున్నారు నిర్మాతలు. ఫారిన్ షెడ్యూల్స్ అన్నింటిని క్యాన్సిల్ చేసి హైదరాబాద్ లోనే షూటింగ్ చేసుకోవాలని ప్రణాళికలు రచించారు. అయితే జీహెచ్ ఎంసీ పరిధిలోనే కరోనా కేసులు ఎక్కువగా వస్తున్నాయి. దీంతో షూటింగ్స్ గురించి పునరాలోచిస్తున్నారు దర్శక నిర్మాతలు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: