నాగశౌర్య ప్రీ లుక్ అదిరింది.. కండలు తిరిగిన దేహంతో..?

frame నాగశౌర్య ప్రీ లుక్ అదిరింది.. కండలు తిరిగిన దేహంతో..?

praveen

తెలుగు చిత్ర పరిశ్రమలో యువ హీరో నాగ శౌర్య కు మంచి క్రేజ్ వున్న విషయం తెలిసిందే. అందరిలా  ఎడాపెడా సినిమాలు చేసుకుంటూ పోకుండా... మంచి స్టోరీ కంటెంట్ ఉన్న సినిమాలు ఎంచుకుంటూ... నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను చేసుకుంటూ కెరియర్ ని మంచి ట్రాక్ లో తీసుకెళ్తున్నాడు నాగ శౌర్య. ఇప్పడి వరకు నాగశౌర్య నటించిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి అని చెప్పాలి.  నాగశౌర్య హీరోగా తెరకెక్కిన చలో సినిమా అయితే మంచి విజయాన్ని సాధించింది కూడా. ఇక ప్రస్తుతం సుబ్రహ్మణ్యపురం దర్శకుడు సంతోష్ జాగర్లమూడి తో నాగ శౌర్య తన 20వ సినిమాని చేస్తున్నారు, 


 ఈ సినిమాపై నాగశౌర్య అభిమానుల్లో  కూడా ఎంతో ఆసక్తి నెలకొంది. సుబ్రహ్మణ్యపురం లాంటి సస్పెన్స్ థ్రిల్లర్ తెరకెక్కిన దర్శకుడు సంతోష్ జాగర్లమూడి నాగశౌర్య తో ఎలాంటి ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అయితే తాజాగా యువ కథానాయకుడు నాగ శౌర్య తన కొత్త సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ విడుదల తేదీని ప్రకటించారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్  ఈ నెల 27న విడుదల చేయబోతున్నట్లు తాజాగా  సోషల్ మీడియా వేదికగా నాగశౌర్య ప్రకటించారు. 

 

 అంతకు ముందుగానే అభిమానులకు ఒక ట్రీట్  ఇచ్చాడు నాగ శౌర్య... ఫ్రీ లుక్ ను విడుదల చేసాడు, ఇప్పుడు వరకు నాగశౌర్య  లవర్ బాయ్ గా కనిపించారు కానీ ఈ ప్రీ లుక్ లో  మాత్రం కండలు తిరిగిన దేహంతో కనిపిస్తున్నాడు నాగశౌర్య. పురాతన క్రీడల్లో  ఒక క్రీడతో మిమ్మల్ని కలిసేందుకు సిద్ధమవుతున్నాను అంటూ ట్విట్టర్ వేదికగా తెలిపాడు.కండలు  తిరిగిన దేహంతో ఉన్న ప్రీ లుక్ ఎంతో ఆసక్తికరంగా ఉంది. అంతేకాకుండా జుట్టు గడ్డం ని కూడా బాగా పెంచేసాడు నాగశౌర్య.ఈ  ప్రీ లుక్ ప్రస్తుతం సినిమాపై మరిన్ని అంచనాలను పెంచుతుంది,

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: