మెగా హీరోల టీనేజ్ ఫోటో.. చూస్తే ఆశ్చర్య పోతారు..?

praveen

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా ఫ్యామిలీ కి సంబంధించిన హీరోలు  అరడజను పైగానే ఉన్న విషయం తెలిసిందే. దాదాపు ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోలు కూడా మెగా ఫ్యామిలీకి చెందిన వారే. ఇక నందమూరి ఫ్యామిలీ నుంచి ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్  మినహా ఇప్పటి వరకు కొత్త హీరో మాత్రం ఎంట్రీ  ఇవ్వలేదు. కానీ మెగా ఫ్యామిలీ నుంచి మాత్రం ఎప్పుడూ కొత్త హీరో ఎంట్రీ ఉంటూనే ఉంది. ఎంతోమంది కొత్త హీరోల వచ్చినప్పటికీ మెగా అభిమానులందరూ వారందరిని ఆదరిస్తూనే వున్నారు. ప్రస్తుతం మెగా ఫ్యామిలీ నుంచి తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయం అయిన వాళ్ళు అందరూ తమదైన గుర్తింపు సంపాదించుకుని  తెలుగు చిత్ర పరిశ్రమలో దూసుకుపోతున్నారు. 

 

 మెగాస్టార్, పవర్ స్టార్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు... వారి తర్వాత తరంలో  అల్లు అర్జున్,  రామ్ చరణ్ ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. ఎవరికీ  వారు తమదైన శైలిలో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు. అదే సమయంలో మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయమైన వరుణ్ తేజ్ తనదైన నటనతో తెలుగు ప్రేక్షకుల అందరికీ లవర్ బాయ్ గా మారిపోయాడు. మెగా ప్రిన్స్  గా ప్రస్తుతం మంచి గుర్తింపు సంపాదించాడు. ఇక మరో హీరో సాయి తేజ కూడా తెలుగు ప్రేక్షకుల సుప్రీమ్ హీరోగా మంచి గుర్తింపు సంపాదించాడు. ఇలా ఎవరికి వారు తమదైన గుర్తింపు సంపాదించుకుని  తెలుగు చిత్ర పరిశ్రమలో రాణించారు. 

 


 ఇదిలా ఉంటే తాజాగా మెగా ఫ్యామిలీ హీరోలకి  సంబంధించి టీనేజ్ ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. ఈ ఫోటో ప్రస్తుతం మెగా అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకర్షిస్తుంది. అల్లు అర్జున్, రామ్ చరణ్, సాయి ధరంతేజ్, వరుణ్ తేజ్,  నిహారిక  ఈ ఫోటోలో ఉన్నారు, టీనేజ్ లో  మెగా హీరోల లుక్స్  ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి  అని చెప్పాలి. ఇక ఈ ఫోటో కాస్త సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది. మెగా హీరోల టీనేజ్ ఫోటో చూసిన మెగా అభిమానులు అందరూ ఎంతగానో మురిసిపోతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: