పుష్ప సినిమాలో అనన్యా ఐటమ్.. అదరగొట్టడం ఖాయం..!

shami

ఆర్య సినిమాలో అ అంటే అమలాపురం పాట నుండి రంగస్థలం సినిమాలో జిగేల్ రాణి వరకు సుకుమార్ సినిమా తీశాడు అంటే అందులో స్పెషల్ సాంగ్ ఉండాల్సిందే. అందరు దర్సకుల్లా కాకుండా తన సినిమాల్లో ఐటం సాంగ్స్ ను మాస్ ను ఉర్రూతలూగించేల్లా ప్లాన్ చేస్తాడు సుక్కు. తనకు ఎలాంటి సాంగ్ కావాలో అడిగిమరి డిఎస్పి నుండి రప్పించుకునే సుకుమార్ ప్రస్తుతం చేయబోతున్న పుష్ప సినిమాలో కూడా అదిరిపోయే ఐటం సాంగ్ ప్లాన్ చేశాడట.

 

మొదట్లో ఈ స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ భామలు ఊర్వశి రౌతులా, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ లతో డిస్కషన్స్ చేస్తున్నారని అన్నారు. కాని లేటెస్ట్ టాక్ ప్రకారం పుష్ప సినిమాలో అల్లు అర్జున్ తో స్టెప్పులేసే ఛాన్స్ ను అందాల భామ అనన్యా పాండే అందుకుందట. విజయ్ దేవరకొండ, పూరి కాంబోలో వస్తున్న పాన్ ఇండియా సినిమాలో అమ్మడు హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా ప్రచార చిత్రాలతో అనన్యా పాండే సూపర్ క్రేజ్ ఏర్పరచుకుంది. ఇంకా మొదటి సినిమా రిలీజ్ అవకుండానే ఆమెకు వరుస ఛాన్సులు వస్తున్నాయి. 

 

ఇప్పటికే మరో రెండు సినిమాల్లో ఆమెను తీసుకునే ఛాన్సులు ఉండగా.. కొత్తగా సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న పుష్ప సినిమాలో కూడా అనన్యా పాండే స్పెషల్ సాంగ్ లో నర్తిస్తుందని అంటున్నారు. అదే జరిగితే అమ్మడికి తెలుగులో సూపర్ క్రేజ్ వచ్చినట్టే. అల వైకుంఠపురములో సక్సెస్ తర్వాత పుష్ప సినిమాను భారీ స్థాయిలో ప్లాన్ చేశాడు బన్నీ. ఈ సినిమాలో పుష్ప రాజ్ పాత్రలో మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపిస్తాడని తెలుస్తుంది.                                       

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: