మహేష్ ను 'ఇడియట్' గా ఊహించుకోండి..!

shami

పూరి జగన్నాథ్ డైరక్షన్ లో మాస్ మహరాజ్ రవితేజ హీరోగా వచ్చిన సినిమా ఇడియట్. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం తర్వాత పూరి, రవితేజ కాంబోలో వచ్చిన ఈ సినిమా యూత్ ఆడియెన్స్ కు బాగా నచ్చేసింది. పూరి టేకింగ్, రవితేజ నటన, చక్రి మ్యూజిక్, రక్షిత అందాలు అన్ని సినిమాకు హైలెట్ గా నిలిచాయి. మాములుగానే పూరి సినిమాల్లో హీరోలు రఫ్ గా ఉంటారు. ఇడియట్ లో చంటి గాడి పాత్రతో రవితేజను మాస్ ఆడియెన్స్ కు దగ్గరచేసింది. ఇక ఈ సినిమా తర్వాత అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి సినిమా కూడా ఈ కాంబోలో వచ్చి సెన్సేషనల్ హిట్ సాధించింది. 

 

ఇడియట్ సినిమాకు మొదట అనుకున్న హీరో రవితేజ కాదట. బద్రి సినిమాతో డైరక్టర్ గా మారిన పూరి తన ప్రతి కథలో హీరోగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఊహించుకుని రాస్తాడట. అప్పట్లో పవన్ మీద ఉన్న ఇష్టం అలాంటిదని అంటుంటాడు పూరి. బద్రి తర్వాత ఇడియట్ కథతో పవన్ ను కలిస్తే చేయనని చెప్పాడట. ఇక ఇదే కథను మహేష్ కు వినిపించాడట పూరి. మహేష్ కూడా తనని ఆడియెన్స్ ఇలా యాక్సెప్ట్ చేస్తారో లేదో అన్న డౌట్ తో వద్దనేశాడట. ఒకవేళ మహేష్ ఇడియట్ కు ఓకే చెప్పి ఉంటే కచ్చితంగా సినిమా రేంజ్ వేరేలా ఉండేది. 

 

మహేష్, పూరి కాంబోలో వచ్చిన పోకిరి సినిమా ఇండస్ట్రీ రికార్డులు బద్ధలు కొట్టింది. ఆ సినిమాతో వీరి కాంబోపై సూపర్ క్రేజ్ ఏర్పడింది. ఆ తర్వాత బిజినెస్ మెన్ సినిమతో కూడా ఈ ఇద్దరు హిట్టు కొట్టారు. పూరి, మహేష్ హ్యాట్రిక్ సినిమా జనగణమన కోసం అందరు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. పూరి మెప్పించే కథతో వస్తే సినిమాలో నటించేందుకు తాను రెడీ అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు మహేష్. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఫైటర్ సినిమా చేస్తున్న పూరి ఆ సినిమా తర్వాత మహేష్ తో సినిమా చేస్తాడేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: