'యూత్'ని మాయలో పడేసిన 'పిల్లా... రా' పాట!?
రామ్‌గోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఆర్ఎక్స్ 100. అర్జున్ రెడ్డి తర్వాత బ్రేకప్ స్టోరీ.. అంతకు మించి రొమాన్స్ సీన్స్ ఉన్నది ఈ సినిమాలోనే. అలాంటి ఈ సినిమాలో కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్ హీరో హీరోయిన్లగా నటించారు. సినిమా ఎంత అద్బుతంగా ఉందంటే.. నిజంగా అమ్మాయిలు ఇలా ఉంటారా ? అని అమ్మాయిలకే డౌట్ వచ్చేలా.. హీరోయిన్ పై అమ్మాయిలకే కోపం వచ్చేలా సినిమా తీశారు.
అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మించిన ఈ సినిమాకు చైతన్ భరద్వాజ్, ఛాయాగ్రహణం రామ్ సంగీతం అందించారు. ఇంకా ఈ సినిమాలో ఎన్నో అద్భుతమైన పాటలు ఉన్నాయి. అన్ని పాటలు హిట్ అయ్యాయి. కానీ చైతన్య ప్రసాద్ రాసిన పిల్లా రా పాటకు అనురాగ్ కులకర్ణి ప్రాణం పోశారు. అప్పట్లో యూత్ ని ఈ సాంగ్ మాయలో పడేసింది అని అనడంలో ఎలాంటి సందేహము లేదు.
'పిల్లా.. రా' వీడియో సాంగ్ అప్పట్లో యూట్యూబ్‌ను షేక్ చేసింది. ఏకంగా 165 మిలియన్ వ్యూస్‌ను ఈ సాంగ్ క్రాస్ చేసి యువత గుండెల్ని కొల్లగొట్టేసింది. అప్పట్లో అయితే ఎక్కడ విన్నా ఇదే పాట వినిపిస్తూ సంచలనం సృష్టించింది. ఎంతోమంది ఈ పాటను రింగ్ టోన్, కాలర్ టోన్స్గా పెట్టుకున్నారంటే ఆశ్చర్యం అక్కర్లేదు. కేవలం పాటలే కాదు.. సినిమా కూడా అప్పట్లో సెన్సేషన్ క్రీయేట్ చేసింది. 2018 టాలీవుడ్ సూపర్ హిట్ సినిమా 'ఆర్ఎక్స్ 100''.