బిజెపి లిస్టులో నాగార్జున !

Seetha Sailaja
  వెండి తెర మన్మధుడు నాగార్జున బిజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని కలిసి తన మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. మెడీ దేశ ప్రధాని అయితే దేశం బాగు పడుతుందని, అభివృద్ధి చెందుతుందని నాగార్జున భావిస్తు మీడియాకు సందేశాన్ని కూడ ఇచ్చాడు. అయితే తాను ఎన్నికలలో పోటీ చేయననీ ఇప్పటికే ప్రకటించాడు. కానీ నాగ్ భారతీయ జనతా పార్టీ తరపున ప్రచారం చేయబోతున్నాడు. ఈ విషయాన్ని భారతీయ జనతా పార్టీ అధికారకంగా ప్రకటించింది. ఎన్నికల్లో బిజీపీ తరుపున ప్రచారం చేసే ప్రముఖుల జాబితాను ఆ పార్టీ తాజాగా విడుదల చేసింది. 40 మందితో కూడిన ఈ లిస్టులో నాగార్జున పేరు కూడా చేర్చారు. వీరితో పాటు కోట శ్రీనివాసరావు, శరత్ బాబు, సురేష్, శివాజీ, జీవిత రాజశేఖర్, శివాజీ రాజా తదితరులు పేర్లు కూడా ఉన్నాయి. అయితే నాగార్జున కూడ చాలామంది లాగే ఈ ఎండలలో ప్రచార రధం ఎక్కుతాడా అనే విషయం తెలియ వలసి ఉంది. అక్కినేని కుటుంబం గతంలో ఎప్పుడు ప్రత్యక్షంగా ఒక పార్టీకి మద్దతు తెలిపిన సందర్భాలు లేవు. ఈ పరిస్థుతులలో నాగ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడు అనే ఆశక్తి అందరిలోనూ ఉంది. ప్రస్తుతం నాగార్జున ‘మనం’ సినిమా విడుదల హడావిడిలో బిజీగా ఉన్న నేపధ్యంలో పొలిటికల్ ఉపన్యాసాలకు నాగ్ కు తీరిక ఉందా అన్నదే ప్రశ్న.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: