పవర్ స్టార్ కు పవన్ షాకిచ్చారా ?

Satya

రాం గోపాల వర్మ. సినిమా కధలు వదిలేసి రియలిస్టిక్ స్టోరీస్ అంటూ చాల సినిమాలు చేశారు అయితే అవేవీ క్లిక్ కాకపోయినా డైరెక్టర్ గా రామూ మాత్రం ఎపుడూ లైం లైట్ లో ఉంటున్నాడు. ఇదిలా ఉండగా రామూ ఇపుడు ఏకంగా పవన్ కళ్యాణ్ మీద గురి పెట్టారు. పవర్ స్టార్ అంటూ టైటిల్ పెట్టి మరీ సినిమా తీస్తున్నాడు.

ఇదేమిటి అంటే ఒక రీల్  స్టోరీ అంటున్నాడు. అన్నీ పవన్ కళ్యాణ్ పోలికలు పెడుతూ ఇది నా సొంత ఆలోచన అంటున్నారు. అది నిజజీవితంలో ఎవరికైనా పోలికలుగా ఉన్నట్లు అనిపిస్తే యాధ్రుచ్చికం కావచ్చు  అంటూ లాజిక్ గా మాట్లాడుతున్నాడు. సరే పవన్ లెక్కలు వేరేగా ఉన్న ఇపుడు పవర్ స్టార్ అంటూ ఆయన చేస్తున్న హడావుడి మాత్రం ‌ సెన్సేషన్ అవుతోంది. 

ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత అంటూ ఆయన పోస్టర్లు రిలీజ్ చేయడం అందులో చిరంజీవితో పాటు పవన్ ఉన్న పోస్టర్లు, ఇతర స్టిల్స్  ఇలా మొత్తానికి మొత్తం పవన్ గురించే సినిమా అన్నట్లుగా తీస్తున్నారు. ఇందులో గురూజీ పాత్ర ఉంటుందట. బహుశా అది ఒక టాలీవుడ్ డైరెక్టర్ ని ద్రుష్టిలో పెట్టుకుని అయి ఉండాలి 

ఏది ఏమైనా కూడా పవన్ ఈ సినిమా మీద ఏమంటారో, పవన్ ఫ్యాన్స్ కం జనసేన సైనికులు ఏమంటారో కూడా ఎవరికీ తెలియడంలేదు. వర్మ మాత్రం ఇది నా సినిమా నేను ఇలాగే తీస్తాను అంటున్నారు అయితే దీని మీద ఒక గాసిప్ వినిపిస్తోంది. పవన్ ఆర్జీవీ వదులుతున్న ఒక్కో స్టిల్స్ ని పోస్టర్లను చాలా మాములుగానే చూస్తున్నారుట.

అయితే పవన్ మాత్రం ఒక్క మాట కూడా దీని మీద  మాట్లాడకుండా చిన్న నవ్వు నవ్వేసి తన పని తాను చేసుకుంటున్నారుట. అంటే వర్మ ఆశించినట్లుగా  రచ్చ ఏమీ జరగడంలేదు. పవన్ వర్మకు ఆ చాన్స్ ఇవ్వకుండా షాక్ ఇచ్చారనుకోవాలి.

ఇక జనసైనికులు కూడా ఇదే తీరున రియాక్ట్ కాకుండా ఉంటే వర్మ ప్లాన్స్ అన్నీ గల్లంతు అవుతాయని అంటున్నారు. మొత్తానికి  ఏ సినిమా లేదు, పవర్ స్టార్ అసలు కనిపించడంలేదు, సినిమాలు ఆయనవి  కూడా ఆగిపోయాయి అనుకున్న వేళ నిజంగా ఆర్జీవీ పవన్ ఫ్యాన్స్ కి ఈ సినిమా ద్వారా గిఫ్ట్ ఇస్తున్నారో మరేమి ఇస్తారో చూడాల్సి ఉంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: