కరోనా మాటతో మైండ్ బ్లాంక్

Satya

బండ్ల గణేష్, నటుడిగా, నిర్మాతగా, రాజకీయ నేతగా, వ్యాపారవేత్తగా పరిచయస్తుడు. గణేష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ వంటి మూవీని తీసి రికార్డులు తిరగరాశాడు. ఇక గణేష్ ఎన్నో సీరియస్ ప్లాన్స్ తన ఫ్యూచర్ ప్జాజెక్టుల గురించి చేస్తున్నాడు. ఇక రాజకీయంగా ఇపుడు విరామం ప్రకటించినా కూడా ఆయన సామాజిక బాధ్యతతో ఉంటున్నారు.

ఇవన్నీ ఇలా ఉంటే గణేష్ కి కరోనా వైరస్ అన్న వార్త ఒక్కసారిగా అందరినీ ఆలోచనలో పడేసింది. ఇక అదే వార్త గణేష్ వింటే ఎలా ఉంటుంది. ఇదే విషయమై ఆయన ఓ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు కరోనా పాజిటివ్ అని చెప్పగానే మైండ్ బ్లాంక్ అయిందని అన్నారు. ప్రపంచంలో ఎవరికి కరోనా వచ్చినా తనకు రాదు అనుకున్నానని కూడా చెప్పారు.

అటువంటి తనకు కరోనా అనగానే భయమేసిందని, తాను ఏమైపోతానోనని కలవరం కలిగిందని  చెప్పుకొచ్చారు. తన కుటుంబం సంగతేంటి అన్న ఆలోచన వచ్చిందని కూడా చెప్పారు. అయితే భగవంతుడి దయ వల్ల కరోనా మహమ్మారి నుంచి బయటపడ్డానని అన్నారు. ఇక మీదట తనకు తన జీవితం ముఖ్యమన్న విషయం కరోనా వైరస్ సోకిన తరువాత అర్ధమైందని చెప్పారు.

కరోనా తనకు నేర్పిన పాఠంతో తాను తన కుటుంబం కోసం ఉంటానని, సమాజానికి మంచి చేస్తానని, ఎవరి మీద గతంలోలా మాట్లాడి రచ్చ చేయాలనుకోలేదని కూడా బండ్ల గణేష్ చెప్పారు. మొత్తానికి కరోనా వల్ల తనకు జీవితం విలువ చాలా తెలిసింది అంటున్నారు. ఇక సినిమా పెద్దలు మోహన్ బాబు, చిరంజీవి వంటి వారు తనకు ఫోన్ చేసి పలకరించడం చాలా ధైర్యాన్ని ఇచ్చిందని కూడా గణేష్ చెప్పారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: