అందచందాలతో, నటనా చాతుర్యంతో ప్రేక్షకులను ఫిదా చేసేసిన రోజా..!
1991 నుండి 2002 వరకు దక్షిణ భారత దేశ సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా కొనసాగిన రోజా ముఠామేస్త్రి, ముగ్గురు మొనగాళ్లు, బైరవదీపం, బొబ్బిలి సింహం, అన్న, అన్నమయ్య క్షేమంగా వెళ్లి లాభంగా రండి, శుభలగ్నం వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. తన కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలోనే రోజా 1999వ సంవత్సరంలో రాజకీయ రంగ ప్రవేశం చేసింది. బిగ్ బాస్ మూవీ లో ఉరుము వచ్చేసిందో పాటలో రోజా తన అందాలను పూర్తిస్థాయిలో ఆరబోస్తూ ప్రేక్షకులకు చెమటలు పట్టించింది.
తిరుమల తిరుపతి వెంకటేశ సినిమా లో శ్రీకాంత్ తో జత కట్టిన రోజా తన చీర కట్టు అందాలతో ప్రేక్షకులను వెండితెరకు కట్టిపడేసింది. 1992లో విడుదలైన సీతారత్నం గారి అబ్బాయి చిత్రంలో వినోద్ కుమార్ సరసన రోజా గ్లామర్ పాత్రలో నటించి ప్రేక్షకులను బాగా అలరించింది. జగపతి బాబు సరసన ఫ్యామిలీ సర్కస్ లో ఈమె పిల్లలకు తల్లిగా చాలా అద్భుతంగా నటించి తన నటనా చాతుర్యాన్ని చాటిచెప్పింది. 1991 సర్పయాగం సినిమాలో శోభన్ బాబు సరసన రోజా అద్భుతంగా నటించి దర్శకులైన పరుచూరి బ్రదర్స్ చేత తెగ పొగిడించుకుంది.
అమ్మోరు తల్లి సినిమా లో రోజా నటనకు ఎవరైనా ఫిదా కావాల్సిందే. అప్పట్లో కథానాయకిగా అలరించిన రోజా తదనంతరం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో కొనసాగుతూ తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసింది. శంభో శివ శంభో, మొగుడు వంటి చిత్రాల్లో ఆమె తల్లి పాత్రలో నటించింది.Powered by Froala Editor