ప్రియాంక చోప్రా మల్టీ మిలీనియన్ డాలర్ ఒప్పందం..!

Suma Kallamadi

అమెజాన్​ ప్రైమ్​ వీడియోతో భాగస్వామిగా మారిన నటి ప్రియాంక చోప్రా.. పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషించడం సహా నిర్మాతగానూ వ్యవహరించనుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుని ఆనందం వ్యక్తం చేసింది. అంతర్జాతీయ నటి ప్రియాంక చోప్రా.. అమెజాన్​ ప్రైమ్ వీడియోతో 'మల్టీమిలియన్ డాలర్' ఒప్పందం కుదుర్చుకుంది. రానున్న రెండేళ్లకుగాను పలు టీవీషోలు చేసిపెట్టనుందీ భామ. ఈ విషయమై ఆనందం వ్యక్తం చేస్తూ ఇన్​స్టాలో పోస్ట్ పెట్టింది.

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
YESSSS @amazonstudios, LET’S 👏GET 👏 IT!!! So honored and excited to finally share this

 

 

ఇవే కాకుండా నెట్​ఫ్లిక్స్​లోనూ రెండు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది ప్రియాంక చోప్రా. 'వుయ్ కెన్ బీ హీరోస్' అనే సూపర్​హీరో సినిమాతో పాటు రాజ్​కుమార్ రావ్​తో 'ద వైట్ టైగర్'లో ప్రధాన పాత్రలు చేస్తోంది. దీనితో పాటే 'ద మ్యాట్రిక్స్ 4'లోనూ హీరోయిన్​గా కనిపించనుంది. కరోనా ప్రభావంతో ఈ చిత్ర షూటింగ్​ మధ్యలో నిలిచిపోయింది. మీతో (అభిమానులు) ఈ ఆనందకర విషయాన్ని పంచుకోవాలని అనుకుంటున్నాను. నాతో భాగస్వామిగా మారిన అమెజాన్​ బృందానికి, అద్భుతమైన ప్రతిభను అందిస్తామని నన్ను నమ్మినందుకు చాలా పెద్ద థ్యాంక్స్"  ప్రియాంక చోప్రా తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: