ఒక్క ఎపిసోడ్ కి ఏడు లక్షల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న తమన్నా..!

Kothuru Ram Kumar

బాలీవుడ్ లో కరణ్ జోహార్ హోస్ట్ చేస్తున్న కాఫీ విత్ కరణ్, టాలీవుడ్ లో మంచు లక్ష్మి హోస్ట్ చేస్తున్న లక్ష్మి టాక్ షో, ప్రదీప్ మాచిరాజు హోస్ట్ చేస్తున్న కొంచెం టచ్ లో ఉంటే చెప్తా షోలు ఎంతగా పాపులారిటీ సంపాదించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ టాక్ షో లలో ప్రముఖ సెలబ్రిటీలు పాల్గొనగా వారి గురించి ఆసక్తికర విషయాలను హోస్ట్ లు బయట పడతారు. అయితే అటువంటి సెలబ్రిటీ టాక్ షో లోనే హోస్ట్ గా బాధ్యతలు నిర్వర్తించేందుకు తమన్నా అంగీకరించిందట. 


ఇటీవల ఈమె తమిళ భాషలో ఒక వెబ్ సిరీస్ చేసిందన్న సంగతి తెలిసిందే. అది పూర్తవగానే తెలుగు డిజిటల్ స్ట్రీమింగ్ యాప్ లో నిర్వహిస్తున్న టాక్ షో లో హోస్ట్ గా చేసేందుకు తమన్నా అంగీకరించిందట. ఈ టాక్ షో లో తన వద్దకు వచ్చిన సెలబ్రెటీలను తమన్నా ప్రశ్నించడం తో పాటు వారితో చిన్న పనులు సరదా పనులను చేయిస్తుంది. తమన్నా స్టార్డమ్ తమ టాక్ షో కి బాగా ఉపయోగకరం గా మారుతుందని తెలుగు డిజిటల్ స్ట్రీమింగ్ యాప్ నిర్వాహకులు భావిస్తున్నారు. నివేదికల ప్రకారం ఏడు లక్షల రూపాయలకు ఒక్క ఎపిసోడ్ చేసేవిధంగా తమన్నా సంతకం చేసిందట. అయితే ఒకవేళ ఆమె 20 ఎపిసోడ్స్ చేసుకున్నా... ఒక కోటి నలభై లక్షల రూపాయలు ఆమె బ్యాంక్ అకౌంట్లో జమ అవుతాయి. నిజానికి ఆమె ఒక సినిమాలో చివరి వరకు నటించినా ఇంత రెమ్యూనరేషన్ రాదట. ఇకపోతే తమన్నా సిటీ మార్ అనే సినిమాలో నటిస్తోంది. కరోనా వైరస్ కారణంగా ఆ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం వాయిదా పడింది. 


ఇకపోతే గత మూడు నెలలుగా ఇంటికే పరిమితమైన తమన్నా యోగాసనాలు వేస్తూ తన ఫిట్నెస్ లెవెల్స్ ను పెంచుకుంటూ పోతుంది. తన యోగాసనాలు కి సంబంధించిన వీడియోలను ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసి తన అభిమానులు కూడా ఆరోగ్యవంతంగా మారాలంటూ ప్రేరేపిస్తుంది. అలాగే తమన్నా తన హాట్ ఫోటోలను నెట్టింట షేర్ చేసి తన అభిమానులను బాగా ఎంటర్టైన్ చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: