అడ్వాన్స్ అప్పుడే వద్దంటున్న హీరోయిన్ లు...?

Gullapally Rajesh

అగ్ర హీరోల సినిమాల విషయంలో  ఇప్పుడు కొందరు హీరోయిన్ లు కాస్త కమర్షియల్ గా ఆలోచనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక అగ్ర హీరోయిన్ లు అనే పేరు వచ్చిన తర్వాత వాళ్ళు ఏ మాత్రం కూడా వెనక్కు తగ్గడం లేదు. కథలో బలం ఉంటే చాలు హీరో స్టార్ అయితే చాలు ఎక్కువగా డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు హీరోయిన్ ల విషయంలో నిర్మాతలు కూడా అనేక జాగ్రత్తలు తీసుకోవడానికి రెడీ అవుతున్నారు. అది ఏంటీ అంటే... గతం లో మాదిరిగా హీరోయిన్ లకు ముందుగానే అడ్వాన్స్ లు ఇచ్చేయవద్దు అని నిర్మాతలు భావిస్తున్నట్టు తెలుస్తుంది. 

 

హీరోయిన్ ల విషయంలో ముందు నుంచి ఉన్న విధానాలు ఇప్పుడు కరెక్ట్ కాదు అని భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు రెండు మూడు సినిమాలు హిట్ కాగానే భారీగా ధరలు పెంచుతున్నారు. ఈ విధానం కరెక్ట్ కాదని చాలా మంది చెప్తున్నా సరే హీరోయిన్ లు మాత్రం మారడం లేదు అనే ఆరోపణలు తీవ్రంగా వస్తున్నాయి. ఇప్పుడు రెండు మూడు సినిమాలు హిట్ అయిన వాళ్ళను ఎక్కువగా డిమాండ్ చేస్తే మాత్రం ఏ ఆలోచన లేకుండా  పక్కన పెట్టాలి అని భావిస్తున్నారట, ఇక ఈ విషయ౦ తెలుసుకున్న రష్మిక మంధన ఒక నిర్ణయం తీసుకుంది. 

 

ఇక నిర్మాతలను సినిమా మొదలు అయ్యే వరకు కూడా అడ్వాన్స్ అడగవద్దు అని అలాగే వాళ్ళు ఇస్తే వద్దు అని చెప్పవద్దు అని ఆమె నిర్ణయం తీసుకుంది అని టాక్ మరి. అది ఎంత వరకు ఫలిస్తుంది అనేది చూడాలి. ఇప్పుడు రెండు మూడు సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. ఎవరిని కూడా ఆమె డిమాండ్ చేసి ఇంత కావాలి అని అడగడం లేదు అని అంటున్నారు. చూడాలి మరి ఆమె భవిష్యత్తు లో ఏ విధంగా ఉంటుందో...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: