హన్సిక హాట్ లుక్స్ చూస్తే చెమ‌ట‌లు ప‌ట్టాల్సిందే..!!

Kavya Nekkanti

హన్సికా.. ఈ పేరుకు పెద్ద‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. పూరీజగన్నాధ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన దేశముదురు సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్ముడు.. మొద‌టి సినిమాతోనే సూప‌ర్ హిట్ అందుకుంది. అదే స‌మ‌యంలో అందరి దృష్టినీ తన వైపుకు తిప్పుకుంది. ఇక 2008లో జూనియర్ ఎన్టీఆర్ పక్కన కంత్రీ సినిమాలో జ‌త క‌ట్టింది. 

రామ్‌తో మస్కా చిత్రంలో నటించి మంచి మార్కులు సంపాదించుకుంది. తర్వాత ప్రభాస్ నటించిన 'బిల్లా' సినిమాలో గెస్ట్ రోల్‌లో నటించింది. అలాగే మ‌రోవైపు తమిళంలో విజయ్ సరసన వెలాయుధం సినిమాలో న‌టించి మంచి విజయాన్ని అందుకుంది. ఇక కేవలం తెలుగు, తమిళంలోనే కాకుండా హిందీలో ఈ అమ్మ‌డు లక్‌ని పరీక్షించుకుని స‌క్సెస్ అయింది. 

అయితే స్టార్ హీరోయిన్ గా ఎదుగుతుందనుకున్న హన్సికా.. అందం అభినయం ఉన్నప్పటికీ స్టార్ హీరోయిన్‌గా ఎదగలేకపోయింది. అప్పట్లో ఓ ఊపు ఊపిన హన్సిక ఇప్పుడు మాత్రం స్టార్ డమ్ ను పక్కన పెట్టి అవకాశాలు కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. 

అందులో భాగంగా తన సోషల్ మీడియాలో హన్సిక అదిరిపోయే పిక్స్‌ను గ్లామర్ స్టిల్స్‌ను పోస్ట్ చేస్తోంది. తాజాగా కూడా అదే చేసింది ఈ బ్యూటి. ప్ర‌స్తుతం హ‌న్సిక హాట్ లుక్స్ నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి. వాటిని చూస్తుంటే ఎవ‌రికైనా చెమ‌ట‌లు ప‌ట్టాల్సిందే అన్న‌ట్టుగా హ‌న్సిక లుక్స్ ఉన్నాయి. మ‌రి వాటిపై మీరు కూడా ఓ లుక్కేసేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: