ఆ పాత్రలో గోపీచంద్ నటన పీక్స్ అనాల్సిందే.. ఆ సినిమా ఏదంటే ?
టాలీవుడ్ లో హీరో గానే కాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు గోపీచంద్. ఆయన హీరో గా చేసిన సినిమాలు మంచి హిట్ ని అందుకున్నాయి. అయితే ఆయన హీరోగా చేసిన సినిమాల కన్నా విలన్ గా చేసిన సినిమాలు మరో రేంజుకు తీసుకెళ్లాయని చెప్పాలి. ఇప్పటి వరకు ఆయన చేసిన పాత్రల్లో జీవిస్తారు అనే మాట మాత్రం అందరికి తెలిసిందే. అగ్ర హీరోల సినిమాల్లో ఆయన చాలా మంచి పాత్రలు చేసారు.
ఇటు హీరోగా, అటు విలన్ గా నటించి ప్రేక్షకులను మెప్పించారు. మహేష్ బాబు హీరోగా నటించిన నిజం సినిమా లో గోపిచంద్ విలన్ పాత్రలో కనిపించారు. ఆ సినిమా అనుకున్న హిట్ ని అందించలేకపోయిన గోపీచంద్ పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. ఆ సినిమానే కాకుండా వర్షం, జయం వంటి హిట్ సినిమాల లో కూడా ఆయన విలన్ పాత్రను పోషించారు. హీరోగా కన్నా విలన్ గా చేసిన సినిమాలు మంచి గుర్తింపును తెచ్చుకున్నాయి అనడంలో అతిశయోక్తి లేదు. అంతగా ఆ పాత్రల ద్వారా పాపులర్ అయ్యారు.
ఇకపోతే ప్రస్తుతం గోపిచంద్ హీరోగానే సినిమాలను చేస్తున్నారు. అందులో కొన్ని సినిమాలు హిట్ టాక్ ను అందుకొంటే మరి కొన్ని సినిమాలు మాత్రం పర్వాలేదు అనే టాక్ ను అందుకున్నాయి. ప్రస్తుతం గోపీచంద్ , సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న సీటిమార్ సినిమాలో నటిస్తున్నాడు. తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది.చిత్రీకరణ చివరి దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే విడుదల ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మధ్యకాలం వచ్చిన ఏ సినిమా గోపీచంద్ కు మంచి హిట్ ని ఇవ్వలేకపోయాయి.. ఈ సినిమా తో అయినా హిట్ ఖాతాను ఓపెన్ చేస్తాడేమో చూడాలి.