అలాంటి అమ్మాయి ఎదురుపడలేదు.. యువ హీరో ప్రేమ కహాని..!

shami

యువ హీరో సందీప్ కిషన్ దశాబ్ధ కాలంగా సినిమాఇతే చేస్తున్నాడు కాని సక్సెస్ రేటు మాత్రం చాలా తక్కువగా ఉంది. అయినా సరే పట్టువదలని విక్రమార్కుడిలా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. వెంకటద్రి ఎక్స్ ప్రెస్ టైం లో కుర్రాడు ట్రాక్ లో పడినట్టు కనిపించినా మళ్లీ కథల సెలక్షన్స్ లో పొరపాట్ల వల్ల కెరియర్ డైలమాలో పడ్డది. ఇదిలాఉంటే సినిమాల్లో చాలాసార్లు ప్రేమలో పడ్డ సందీప్ కిషన్ రియల్ లైఫ్ లో మాత్రం తనని ఇంప్రెస్ చేసిన అమ్మాయి ఇంకా తారసపడలేదని అంటున్నాడు.

 

తనకు కాబోయే అమ్మాయి ఎలా ఉండాలో ఈమధ్య ఓ ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నాడు సందీప్ కిషన్. స్ట్రాంగ్, స్మార్ట్ గా ఉంటూ అందరిని ఇన్ స్పైర్ చేసేలా ఉన్న అమ్మాయి తనకు లైఫ్ పార్ట్ నర్ గా కావాలని చెప్పాడు. అంతేకాదు ఇంతవరకు అలాంటి అమ్మాయి తనకు ఎదురుపడలేదని అంటున్నాడు. తను చేసే ప్రతి సినిమా హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకుంటాడంటూ అతని మీద రూమర్స్ బాగానే వస్తాయి. కాని సందీప్ మాత్రం ఇంతవరకు తన మనసుని టచ్ చేసిన అమ్మాయి దొరకలేదని చెబుతున్నాడు.

 

ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం సందీప్ కిషన్ A1 ఎక్స్ ప్రెస్ సినిమా చేస్తున్నాడు. లావణ్య త్రిపాఠి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. టాలెంట్ ఉన్నా సరే లక్ కలిసి రాని సందీప్ కిషన్ ఎప్పటికైనా సరే అందరిని మెప్పించే హిట్టు కొడతాడని చెబుతున్నాడు. ఆరోజు త్వరలోనే రావాలని సందీప్ కిషన్ కెరియర్ గాడిలో పడాలని ఆశిద్దాం. ప్రయత్నాలు చేస్తూ ఉంటే తప్పకుండా సందీప్ అనుకున్న సక్సెస్ అందుకుంటాడని చెప్పొచ్చు. లాస్ట్ ఇయర్ వచ్చిన తెనాలి రామకృష్ణ బిఏ, బిఎల్ సినిమా నిరాశపరచింది. అందుకే ఇక మీదట కథల విషయంలో మరింత జాగ్రత్త పడాలని నిర్ణయించుకున్నాడు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: