ప్రతి ఒక్కరికీ బాధలు ఉంటాయి.. ఇకనైనా మారుదాం : నటి అనుష్క

siri Madhukar

బాలీవుడ్ యువ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య అన్ని సినీ పరిశ్రమలను తట్టి లేపుతుంది.  ఒకప్పుడు తెలుగు సీనీ పరిశ్రమలో తారా జువ్వలా ఎగసిపడిన ఉదయ్ కిరణ్ ఆకస్మిక ఆత్మహత్య అందరి హృదయాలను కలచి వేసింది.  తాజాగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్  ఆత్మహత్య కూడా అలాగే  సినీ తారల హృదయాలను తాకింది.  ఇక ఈ హీరో  డిప్రెష‌న్ వ‌ల‌న క‌న్నుమూశాడ‌ని కొంద‌రు ఆరోపిస్తుండ‌గా, మ‌రి కొంద‌రు బ్రేక‌ప్ వ‌ల‌న బ‌ల‌వ‌న్మ‌ర‌ణం చెందారని ప్ర‌చారం చేశారు. అయితే అభిమానులు మాత్రం నెపాటిజం వ‌ల‌నే ఆయ‌న ఆత్మ‌హ‌త్య  చేసుకున్నాడ‌ని అంటున్నారు.

 

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య విషయం విని మహేష్ బాబు కన్నీటి పర్యంతం అయ్యారు.. ఎంతో భవిష్యత్ ఉన్న హీరో మరణం కలచి వేసిందని అన్నారు. ఎంతో మంది ఈ హీరో మరణానికి శ్రద్దాంజలి ఘటిస్తూనే.. ఇలా జరగడానికి నెపోటిజం (బంధుప్రీతి) కారణం అంటున్నారు. ఈ నేపథ్యంలోనే చాలా మంది సెలబ్రెటీలు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ తమ సోషల్ మాద్యామాల్లో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా ఇకనుంచైనా మంచిగా బతికేందుకు ప్రయత్నిద్దామని హీరోయిన్ అనుష్క చెప్పింది. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య నేపథ్యంలో ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆమె భావోద్యేగపూరిత పోస్ట్ పెట్టింది. ఇక్కడ ఎవరూ పర్ఫెక్ట్ కాదని ఆమె తెలిపింది.

 

మనలో ఎవరూ ఒక రోడ్ మ్యాప్ తో పుట్టలేదని... ఇది మంచి మార్గం, అది చెడు మార్గం అని లేవని చెప్పింది. ప్రతి ఒక్కరికీ చిన్నవో, పెద్దవో బాధలు ఉంటాయని తెలిపింది. బాధల్లో కొందరు సాయం కోసం ఏడుస్తారని... మరికొందరు ఎవరికీ చెప్పుకోలేక లోపలే కుమిలిపోతారని చెప్పింది. అందరం ఇకనైనా జాలి, దయతో జీవిద్దామని అనుష్క తెలిపింది. నిస్సహాయుల మాటలు విందామని, వారిని ప్రేమిద్దామని చెప్పింది. అందరం కలిసి ఉత్తమంగా జీవించేందుకు ప్రయత్నిద్దామని పిలుపునిచ్చింది.

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
Every single one of us out there can only handle a situation only the way we know how to .. no one is ever ever perfect ..... there is no right way ,no wrong ,we are not born with a road map, to get through life ...no one has ever , Each one of us big or small are vulnerable in our own ways ... each one of us do break inside ..and it’s ok ..some cry out for help some cry in silence,some distract , some indulge each one has their own ways and some are helpless ...let each one of us please in our own {{RelevantDataTitle}}