ఆ స్టార్ డైరెక్టర్ కి మిగిలింది చిన్న హీరోలే..

Pranateja Sriram

కరోనా వల్ల సినిమా ఇండస్ట్రీకి మామూలు దెబ్బ పడలేదు. సినిమాలు లేక షూటింగులు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇప్పుడిప్పుడే సినిమా షూటింగులకి అనుమతులు లభిస్తున్న నేపథ్యంలో మళ్లీ సినిమా వారిలో ఒక కొత్త ఆశ చిగురించింది. అయితే కరోనా రక్కసి వల్ల సినిమా షూటింగులు ఆగిపోవడమే కాదు, స్టార్ట్ కావాల్సినవి కూడా స్టార్ట్ అవకుండా ఆగిపోయాయి. అన్నీ సవ్యంగా జరిగి ఉంటే ఈ పాటికి ఇండస్ట్రీలో ప్రతీ ఒక్కరూ ఫుల్ బిజీగా ఉండేవారు.

 

అదలా ఉంచితే సైరా నరసింహారెడ్డి సినిమా ద్వారా తనకంటూ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న డైరెక్టర్ సురేందర్ రెడ్డి తన నెక్స్ట్ సినిమా ఎవరితో ఉంటుందనేది ఇంతవరకూ ప్రకటించలేదు. సురేందర్ రెడ్డి మొదటి సినిమా కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కింది. ఆ తర్వాత అతడు తీసిన సినిమాలన్నీ స్టార్ హీరోలతోనే. రవితేజతో కిక్, అల్లు అర్జున్ తో రేసుగుర్రం, రామ్ చరణ్ తో ధృవ ఇలా ప్రతీ సినిమాని స్టార్ హీరోతోనే తెరకెక్కించాడు.

 

కానీ ప్రస్తుతం సురేందర్ రెడ్డికి స్టార్ హీరోలెవరూ అందుబాటులో లేరు. ప్రతీ ఒక్కరూ తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఎన్టిఆర్, రామ్ చరణ్ లు ఆర్.ఆర్.ఆర్ తో బిజీగా ఉన్నారు. అటు ప్రభాస్ రాధాక్రిష్ణ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. రవితేజ చేతిలో ఆల్రెడీ రెండు సినిమాలు ఉన్నాయి. మహేష్ బాబు సినిమా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇక మిగిలిన వారందరి చేతిలోనూ సినిమాలు ఉన్నాయి.

 

దాంతో ఈ సారి సురేందర్ రెడ్డి స్టార్ హీరో దొరికే అవకాశం లేదు. అందువల్ల సురేందర్ రెడ్డి చిన్న హీరోతో సినిమా చేయక తప్పదు. లేదు.. పెద్ద హీరో కోసమే వెయిట్ చేస్తానంటే మాత్రం వచ్చే సంవత్సరం వరకూ వెయిట్ చేయాల్సిందే. మరి సురేందర్ రెడ్డి చిన్న హీరోతో సినిమా చేస్తాడా లేదా చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: