చిరూ ని మాస్ కి మరింత దగ్గర చేసిన సినిమా

Gullapally Venkatesh

మన తెలుగులో చిరంజీవి సినిమాల్లో మాస్ కి బాగా దగ్గర అయిన సినిమా శంకర్ దాదా ఎంబీబీఎస్. ఈ సినిమా బాలీవుడ్ రీమేక్ అయినా సరే ఈ సినిమాలో ఉండే కొన్ని కొన్ని సన్నివేశాలు మాస్ ఆడియన్స్ తో పాటుగా క్లాస్ ఆడియన్స్ ని కూడా బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో చిరంజీవి నటన ఆయన నడక ఆయన చేసే కామెడి అన్ని కూడా మాస్ కి చాలా బాగా దగ్గరయ్యాయి అనే  విషయం చెప్పవచ్చు. ఆయనకు అప్పటికే చాలా మంచి స్టార్ ఇమేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఆ సినిమాతో అది ఇంకాస్త పెరిగింది అనే చెప్పవచ్చు. ఆయన సినిమాలు మొదలు పెట్టిన నాటి నుంచి నేటి వరకు కూడా తన నటన తో ఎక్కువగా మాస్ ని ఆకట్టుకున్నారు. 

 

ముఖ్యంగా ప్రతి తరాన్ని కూడా ఆయన తన నటన తో ఆకట్టుకున్నారు అనే చెప్పాలి. ఏ స్టార్ హీరో చేయని విధంగా ఆయన సినిమాలను మాస్ కి దగ్గరయ్యే విధంగా చేసారు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాలో కూడా మాస్ ఇమేజ్ ని ఉండే విధంగానే చూసుకుంటూ సినిమాలు చేస్తున్నారు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ఆయన రిటర్న్స్ ఇచ్చిన సినిమా ఖైదీ నెంబర్ 153 లో కూడా ఆయన మాస్ ని ఆకట్టుకునే విధంగానే నటించారు అనే విషయం చెప్పవచ్చు. ఆ సినిమాను ఎక్కువగా ఆయన మాస్ అభిమానులే చూసారు. 

 

శంకర్ దాదా సినిమా విషయానికి బాలీవుడ్ లో కూడా అంత అందంగా సంజయ్ దట్ చేయలేదు అని అంటారు. అక్కడ ఆయనకు మాస్ ఇమేజ్ ఉన్నా సరే అంత బాగా ఆయన చేయలేదు అని కాని చిరంజీవి మాత్రం చేసారు అని చెప్తారు. ఆ విధంగా ఈ సినిమా మాస్ కి దగ్గరైంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: