ప్రభాస్ సినీ కెరియర్ లో అతి పెద్ద బ్లాక్ బాస్టర్ అందుకున్న సినిమా ఏంటో తెలుసా..
ప్రభాస్.. ఈ పేరు తెలియని వాళ్ళు ఉండరేమో.. రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడుగా పరిచయమైన ఈ హీరో రాఘవేంద్ర సినిమా ద్వారా ప్రేక్షకులను పలకరించాడు..ఆ సినిమాలో తన నటనకు మంచి గుర్తింపు రావడంతో ఇప్పుడు వరుస సినిమాలలో నటిస్తూ వస్తున్నాడు..ఆ సినిమా తర్వాత వచ్చిన ఈశ్వర్ సినిమాలో కూడా ప్రభాస్ నటన హైలెట్ అవ్వడంతో సినిమా సూపర్ హిట్ అయింది..దాంతో ప్రభాస్ కు రెండు సినిమాలతోనే మంచి హిట్ టాక్ ను అందుకున్నాడు..
ప్రభాస్ సినిమాలతో నే కాకుండా నిజ జీవితంలో కూడా అతనికి మంచి పేరు ఉంది..మంచి మనసున్న మారాజు అనే విషయం అందరికి తెలిసిందే.. అయితే ఒక్కో సినిమాలో తన గ్రేస్ ను స్టయిల్ ను పెంచుకుంటూ వచ్చిన ఈ హీరో వరుస హిట్ సినిమాలతో తన ఖాతాను నింపుకున్నడు..అంతేకాక ఎనలేని అభిమానులను సంపాదించుకున్న వ్యక్తిగా ప్రభాస్ పేరు మారు మోగుతుంది. టాలీవుడ్ లో అందరూ ప్రభాస్ ను ముద్దుగా డార్లింగ్ అని పిలుచుకుంటారు..
ప్రభాస్ సినిమాలలో చాలా సినిమాలు అభిమానులను ఆకట్టుకున్నాయి.. బాహుబలి సినిమా గురించి చెప్పాల్సిన అవసరం లేదు.. ఆ సినిమాతో ప్రపంచ స్థాయి హీరోగా దేశ విదేశాల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు.. దాంతో ప్రభాస్ తో సినిమా తీయడానికి దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. డార్లింగ్ కెరియర్ ఆ సినిమా తో రంగులరాట్నం అయిపోయింది.. అయితే ప్రభాస్ బాహుబలి తర్వాత వచ్చిన సినిమా అంటే సాహో .. ఈ సినిమా భారీ యాక్షన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి రోజే మొహం చాటేసింది.. భారీ యాక్షన్ కోణంలో వచ్చిన భారీ బడ్జెట్ సినిమా గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన డార్లింగ్ అభిమానులకు నిరాశను మిగిల్చింది..ఆ సినిమా ఎన్నో అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన కూడా కథ బాగొలేదని మాటలను అందుకుంది.. ప్రస్తుతం ప్రభాస్ జిల్ ఫేమ్ రాధ కృష్ణ దర్శత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.. లాక్ డౌన్ కారణంగా చిత్రీకరణలో ఆగిపోయింది..త్వరలోనే ఆ సినిమా విడుదల కానుంది..