తెలుగు తెర అందగాడు శోభన్ బాబు !

Seetha Sailaja
ఈ స్పీడ్ ప్రపంచంలో ఒక హీరో చనిపోయి కూడ అతని అభిమానుల గుండెలలోనే కాకుండా పది కోట్ల మంది తెలుగు హృదయాలలో ఇప్పటికీ చిరస్మరనీయుడిగా నిలిచి పోయిన అదృష్టం ఒక్క శోభన్ బాబుకే దక్కుతుంది. ఆంధ్రుల అందగాడిగా దాదాపు మూడు దశాబ్దాల పాటు తెలుగు తెరను ముఖ్యంగా అలనాటి అమ్మాయిల, మహిళల హృదయాలను దోచుకున్న అదృష్టం ఒక్క ఉప్పు శోభనా చలపతికే దక్కింది. 1937 జనవరి 14న కృష్ణా జిల్లాలోని మైలవరం దగ్గర పుట్టిన శోభనా చలపతిని చూసి ఆ అబ్బాయి తెలుగు తెరను మూడు దశాబ్దాలు ఎలాడమే కాకుండా అక్కినేని, నందమూరిల తరువాత తెలుగు సినిమా రంగాన్ని కుటుంబ కధా సినిమాల నాయకుడిగా ఎలుతాడని ఎవరు అనుకోలేదు. ఆ రోజులలో డిగ్రీ వరకు చదివి లా డిగ్రీ చేస్తూ సినిమాల పట్ల మోజుతో సినిమా రంగంలోకి ప్రవేసించిన శోభన్ బాబు తొలి దశలో ఎదుర్కున్న సమస్యలు, అవమానాలు అన్నీ ఇన్నీ కావు. చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ బండి లాగిస్తున్న శోభన్ బాబు కెరియర్ ను 1965 లో వచ్చిన ‘వీరాభిమన్యు’ సినిమా శోభన్ బాబు కెరియర్ కు ఒక టర్నింగ్ పాయింట్ ఇస్తే ఆ తరువాత వచ్చిన ‘మనుషులు మారాలి’ సినిమా శోభన్ బాబు లోని అసలు నటుడుని బయట పెట్టింది. అప్పటి నుంచి 1997 వరకు ఎన్నో ఆణి ముత్యాలు లాంటి సినిమాలలో నటించాడు శోభన్ బాబు. ‘సోగ్గాడు’, బాబు, గోరింటాకు, కళ్యాణమండపం, జేబుదొంగ, మానవుడు దానవుడు, జీవనతరంగాలు, దేవత లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి మెప్పించాడు శోభన్ బాబు. బాపు దర్సకత్వంలో సంపూర్ణ రామాయణంలో రాముడిగా నటించి అలనాటి నందమూరి తారక రామారావు అభినందనలు అందుకున్న అదృష్ట వంతుడు శోభన్ బాబు. 9 సార్లు ఫిలిం ఫేర్ అవార్డును అందుకున్న అదృష్టం మన దక్షిణాది హీరోలలో ఒక్క శోభన్ బాబుకు మాత్రమే సొంతం. ప్రభుత్వం నుండి పద్మ పురస్కారాలు, విశ్వవిద్యాలయాల నుండి కళాప్రపూర్ణ సత్కారాలు శోభన్ బాబుకు అందక పోయినా తెలుగు ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం శాస్వితంగా పొందిన అదృష్టం శోభన్ బాబు సొంతం. ఒక మనిషి ఎలా జీవించాలో తెలియ చెప్పడానికి నిలువెత్తు నిదర్సనంగా శోభన్ బను జీవితాన్ని చాలామంది చెపుతూ ఉంటారు. ఈరోజు శోభన్ బాబు మన మధ్య లేకపోయినా ఆయన సినిమాలు మాత్రం ఎప్పుడు మనతో జీవించే ఉంటాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: