ఎందరో మహానుభావులు అంటు సంగీత ప్రేమికులను మైమరపింప చేసిన ఇళయరాజా..?

praveen

మాస్ మసాలా సంగీతంతో తెలుగు సంగీతాన్ని కొత్త పుంతలు తొక్కించిన అద్భుతమైన సంగీత దర్శకుడు ఇళయరాజా... తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతగానో గొప్ప పేరు సంపాదించిన సంగీత దర్శకులలో మొదటి వరుసలో ఉంటారు ఇళయరాజా.1970 కి ముందు తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక వినసొంపైన సంగీతం ఉండేది కానీ ఆ తర్వాత మాత్రం మాస్ మసాల చిత్రాలు రావడంతో... వినసొంపైన సంగీతం ఎక్కడా కనిపించలేదు. ఆ సమయంలోనే తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఇళయరాజా అనే గొప్ప సంగీత దర్శకుడు పరిచయం అయ్యాడు. భద్రకాళి సినిమాతో సంగీత దర్శకుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఇళయరాజా....ఆయన  సంగీతంతో  మరోసారి శ్రోతలను ఆకర్షించారు. సంగీత ప్రేమికులకు ఇళయరాజా సంగీతం  సరి కొత్తగా అనిపించింది. 

 


 దీంతో సంగీత దర్శకుడిగా పరిచయం అయిన నాటి నుంచి మెల్లమెల్లగా విభిన్నమైన వాయిద్యాలకు అద్భుతమైన స్వరాలను జోడిస్తూ.. సంగీత ప్రేమికులు అందరినీ ఎంతగానో అలరించారు ఇళయరాజా. ఇప్పటి సంగీత దర్శకులకు ఎంతోమందికి ఈయన  గొప్ప స్ఫూర్తి. ఆయన ఎలాంటి పాటలోనైనా  తనదైన సంగీత నైపుణ్యం చూపించగలరు. మాస్ పాటైన... మెలోడీ పాట  అయినా... సంగీత ప్రాధాన్యమైన పాట అయినా ఎలాంటి పాత్రలోనైనా తనదైన నైపుణ్యం చూపించి శ్రోతులను  ఎంతగానో ఆకర్షించగలరు . ఇక అయినా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమై ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన విషయం తెలిసిందే. ఇళయరాజా సంగీతం విని ఆయన సంగీతానికి మంత్రముగ్ధులను అవని సంగీత ప్రేమికులు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. 

 

 


 అయితే ఇలయరాజా బాలకృష్ణ హీరోగా నటించిన అశోక చక్రవర్తి సినిమాలు సమకూర్చిన సంగీతం నేటి తరం ప్రేక్షకులను కూడా అలరిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా అశోక చక్రవర్తి సినిమా లోని ఎందరో మహానుభావులు అనే పాట ఇప్పటికీ సంగీత ప్రేమికులను అలరిస్తూనే ఉంది. ఆ పాటలోని అర్థం... చరణం ఆ పాట సాగిపోయే విధానం.. ఇలా ప్రతి విషయంలో సంగీత దర్శకులు తన నైపుణ్యాన్ని చూపించి ఎంతో మందిని తన సంగీతంతో మైమరిపింపచేశాడు. అయితే ఆనాడు ఇళయరాజా సమకూర్చిన ఎందరో మహానుభావులు అనే పాటకు నేటి తరం లో కూడా రీమేక్ వచ్చినప్పటికీ.. నాడు ఇళయరాజా సమకూర్చిన పాటనే  ఇప్పటికీ ప్రేక్షకులకు ఫేవరెట్గా ఉంది అంటే సంగీత ప్రేమికులు ఆ పాట ఎంతలా  ప్రభావితం చేసిందో అర్థం చేసుకోవచ్చు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: